భార్యా భర్తలు శృంగారాన్ని ఎంజాయ్ చెయ్యాలనుకుంటే ఈ టిప్స్ ను ఫాలో అవ్వాల్సిందే..

-

పెళ్ళైన మొదట్లో శృంగారం అంటే అదొక తీపి గుర్తు..ఇంకా కావలి అనుకుంటారు..కొన్ని నెలలు గడిచిన తర్వాత లేదా పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఆసక్తి ఇద్దరిలోనూ తగ్గిపోతుంది..రాను రాను ఆ కోరిక పూర్తిగా తగ్గిపోతుంది.అయితే దంపతుల మధ్య శృంగార కాంక్షను పెంచడానికి, శృంగారాన్ని మరింతగా ఆస్వాదించడానికి, లైంగిక చర్యలో పూర్తి తృప్తి పొందడానికి యోగా చాలా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని యోగసనాలు సాధన చేయడం ద్వారా లైంగిక కాంక్ష పెరుగుతుందని, పడకపై మరింత సౌకర్యంగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు..

యోగా మీ జీవితంలో అన్ని స్థాయిల్లో సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుంది. దంపతులు కలిసి చేసే యోగాతో ఆధ్యాత్మిక, శారీరక, లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు.యోగా ఉద్వేగం, ప్రేరేపణ మొత్తం లైంగిక సంతృప్తిని పెంచుతుంది. పెల్విక్ ప్రాంతాని రక్త ప్రసరణను పెంచుతుంది. జననేంద్రియాల వద్ద రక్త ప్రసరణ మెరుగుపడితే అది శృంగారాన్ని ఆస్వాదించేలా చేస్తుంది. యోగా వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. పనిపై దృష్టిని కేంద్రీకరించేలా చేస్తుంది..మరి యోగలో ఎటువంటి ఆసనాలు వేస్తే మంచాల మీద రెచ్చిపోవచ్చునో ఇప్పుడు చూద్దాం..

వజ్రాసన.. మోకాళ్లను నెమ్మదిగా కిందకు వంచాలి. మోకాళ్లను ఒకదానికొకటి సమాంతరంగా ఉంచాలి. కుడి, ఎడమ కాళ్లను ఒకదానికి ఒకటి దగ్గరగా ఉంచాలి.తల భాగాన్ని నిటారుగా ఉంచి, చేతులను కాళ్లపై ఉంచాలి.. ఇలా చేస్తే శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు..

ధనురాసన.. శరీరాన్ని విల్లులా వంచే ఆసనం ఇది ముందుకు బోర్లా నేలపై పడుకోవాలి. తర్వాత కాళ్లను, చేతులను పైకి లేపాలి. చేతులతో కాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. శరీరాన్ని వెనక వైపుకు వంచడానికి ప్రయత్నించి అదే విల్లు భంగిమలో ఉండాలి.ఇది కూడా లైంగిక సామార్థ్యాన్ని పెంచుతాయి..

యోగలో ఈ రెండు ఆసనాలు చాలా ముఖ్యమైనవి.. ఇలాంటివి మరెన్నో ఉన్నాయి.. బిజీ బిజీ జీవితంలో ఇలాంటి కొన్ని ఆసనాలు కూడా ఉన్నాయి..ఇవన్నీ శృంగార సామార్థ్యాన్ని పెంచుతాయి.. ఒకసారి ట్రై చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news