జూన్ 21 మంగళవారం రాశి ఫలాలు..

-

మేషం : ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు బాగుంటాయి. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు..దైవదర్శనాలు, దూరప్రయాణాలు..

వృషభం : రుణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. సన్నిహితుల తో జాగ్రత్తగా ఉండాలి..మంచి ఫలితాలు ఉంటాయి.

మిథునం :  ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో ఓపిక పట్టాలి..

కర్కాటకం : కుటుంబ సభ్యులు విషయంలో జాగ్రత్రగా ఉండాలి.. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.

సింహం : కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ప్రతి పనిని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది..కొత్త ఉద్యోగ అవకాశాలు నిరాశను కలిగిస్తాయి.

కన్య : మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

తుల : ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలు ఉండవు..ఈరోజు అనుకున్నపనులు పూర్తీ అవుతాయి.

వృశ్చికం : నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి..కొత్త వ్యక్తులతో పరిచయం.

ధనుస్సు : సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది.కొత్త పనులు సకాలంలో నెరవేరుతాయి.

మకరం :గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.

కుంభం : కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సాయం ఆలస్యంగా లభిస్తాయి.

మీనం : వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోను స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది..ఈరోజు అనుకొని శుభవార్తలు వింటారు.

Read more RELATED
Recommended to you

Latest news