మహాశివరాత్రి నాడు రాశిచక్రం ప్రకారం ఎవరు ఏం చేస్తే మంచిదంటే..!

రేపే మహాశివరాత్రి..శివపూజకు సమయం వచ్చేసింది. ఈరోజున ( మార్చి1) మీ రాశి ప్రకారం..మీరు శివదేవుడిని ఆరాధిస్తే..శివున్ని ప్రసన్నం చేసుకోవచ్చు. ప్రతి రాశికి దాని స్వంత గ్రహం ఉంటుంది, దాని ఆధారంగా శివునికి ఇష్టమైన వస్తువులతో పూజించాలి.. తద్వారా మహాదేవుడు త్వరలో సంతోషిస్తాడని పండితులు అంటున్నారు.. ఈ మహాశివరాత్రి నాడు, మీ రాశి ప్రకారం శివుడిని ఎలా పూజించాలో చూద్దాం..
మేషం: ఈ రాశి వారు మహాశివరాత్రి రోజు శివుడిని బెల్లంతో, ఎర్రటి పువ్వులతో, ఎర్ర చందనంతో పూజించాలట.
వృషభం: మహాశివరాత్రి నాడు వృషభరాశి వారు శివుని పాలు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. మల్లెపూలు సమర్పించాలి.
మిథునం: మహాశివరాత్రిన ఈ రాశి వారు శివలింగానికి దాతురా, పెరుగు కలిపిన నీటిని సమర్పించాలట. దీనితో పాటు పంచాక్షర మంత్రం ఓం నమః శివాయ జపం చేయాలి.
కర్కాటకం: మహాశివరాత్రి నాడు కర్కాటక రాశి వారు శివునికి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించి చందన పరిమళాన్ని కూడా సమర్పించాలి.
సింహం : ఈ రాశి వారు ఎర్రటి పూలతో పూజించాలి. వారికి నెయ్యి దీపం వెలిగించి, శివ చాలీసా పఠించండి.
కన్య: ఈ రాశి వారు శివునికి బిల్వపత్రం, దాతుర, నల్ల నువ్వులు, గంగాజలంతో పూజించాలి. ఓం నమః శివాయ మంత్రం పఠించడం వల్ల కల్యాణం త్వరలో కలుగుతుంది.
తుల: మహాశివరాత్రి రోజు ఆవు పాలలో చక్కెర మిఠాయిని కలిపి శివునికి అభిషేకం చేయండి. నీటిలో తెల్లటి చందనం వేసి శివునికి అభిషేకం కూడా చేయవచ్చు. ప్రయోజనం ఉంటుంది.
వృశ్చికం: వృశ్చిక రాశి వారు మహాశివరాత్రి నాడు శివునికి బిల్వపత్రం, ఎర్ర గులాబీలు సమర్పించి పూజించాలి. శివ రుద్రాష్టకం పఠించడం మరీ మంచిది..
ధనుస్సు: ఈ రాశి వారు మహాశివరాత్రి నాడు పసుపు, గులాల్ మొదలైన వాటితో మహాదేవుని పూజించాలి. ఆనందంలో ఖీర్‌ను అందించండి.
మకరం: మహాశివరాత్రి రోజు ఈ రాశివారు ధాతుర, పూలతో శివుని పూజించాలి.
కుంభం: ఈ రాశి వారు శివునికి పూలు, చెరుకు రసం సమర్పిస్తే ఆదాయం పెరుగుతుంది.
మీనం: మీన రాశి వారు శివునికి చెరుకు రసం, కుంకుమ, పసుపు, పంచామృతాలతో పూజించాలి. ఆనందం ,శ్రేయస్సు పెరుగుతుంది.
గమనిక: పండితులు చెప్పిన దాని ప్రకారం ఈ సమాచారం ఇవ్వడం జరిగింది.
-Triveni Buskarowthu