కొబ్బరిచిప్పలో చాయ్..రుచిలో వేరే లెవల్..

-

ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది..కానీ కొంత మంది మాత్రం చాలా కొత్తగా ఆలోచిస్తారు.నలుగురు చేసేది నేను చేస్తే కిక్ ఏముంది..ఇంకా కొత్తగా చేస్తాను అని ఆలోచిస్తారు.అలాంటి వాళ్ళు నూటికో కోటికో ఒకరు ఉంటారు..వాళ్ళ ఆలోచనలు సంథింగ్ స్పెషల్ గా ఉంటాయి.అందుకే అందరికి నచ్చుతాయి. బిజినెస్ చేసెవాల్లు ఎప్పటికప్పుడు కొత్తగా చేస్తేనే డెవలప్ అవుతుంది.మూడు పువ్వులు, ఆరు కాయలుగా సక్సెస్ అవుతుంది.అలాంటి ఒక వెరైటీ ఆలోచన చేశాడు ఓ యువకుడు..ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలిచాడు. అతని సక్సెస్ స్టోరీ గురించి ఒకసారి తెలుసుకుందాం..

అతని పేరు దీనా..చెన్నై లో ఉంటాడు..ఏం చేసినా అందులో సంథింగ్ స్పెషల్ ఉండాలి అనుకుంటడు. అందుకే ఓ టీ షాపు పెట్టిండు. ఇందులో వెరైటీ ఏముందని అనుకోవచ్చు. ఇక్కడే మనోడు తన టాలెంట్ చూపించి అందర్నీ ఫిదా చేసిండు. ,చాయ్ ను అందరిలాగా గ్లాసుల్లోనో, కప్పుల్లోనో కాకుండా కొబ్బరి చిప్పల్లో అమ్ముతుండు. ఐడియానే కాదు.. చాయ్ టేస్ట్ కూడా అదుర్స్ అనిపించేలా ఉంటుంది. ఇంకేముంది. బిజినెస్ కూడా క్లిక్ అవ్వడంతో మనోడు ఇప్పుడు ఫుల్ ఫెమస్ అయ్యాడు.

ఆరు నెలల క్రితం చెన్నైలోని మెరీనా బీచ్‌ వద్ద ఈ టీ షాప్ పెట్టిన దీనా.. మొదట్లో గ్లాసుల్లోనూ, కప్పుల్లోనూ కాఫీ, టీ అమ్ముతుండేవాడు..పర్యావరణ రక్షణ కోసం కొబ్బరి చిప్పల్లో కాఫీ, టీ అందించాలని నిర్ణయం తీసుకున్నాడు. ప్రత్యేకంగా కొబ్బరి చిప్పలను తయారు చేయడానికి కొంతమంది వ్యక్తులను నియమించుకున్నాడు. రోజుకు దాదాపు 60- నుంచి 70 కప్పులను ఉపయోగిస్తున్నట్లుగా దీనా తెలిపాడు. అతనిలో మరో గొప్ప క్వాలిటీ కూడా ఉందండోయ్..ప్రతి సోమవారం అతను బ్లాక్ కాఫీని కేవలం ఒకరూపాయికి మాత్రమే అందిస్తున్నాడు..దాని గురించి అతన్ని అడిగితే నేను ఆ కాఫీ ఫ్యాన్ ను అందుకే ఇస్తున్నా అని చెప్పాడు.మొత్తానికి అతను బాగా ఫెమస్ అయ్యాడు..మీరు ఎప్పుడైనా చెన్నై మెరినా బీచ్ కు వెళితే అక్కడ చాయ్ ని ట్రై చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news