వడగండ్ల వాన గురించి అందరికీ తెలిసిందే. కానీ చేపల వర్షం సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో కనిపించదు. సముద్రానికి దగ్గర్లోని ప్రాంతాల్లో పెద్ద సునామీ, సుడిగాలి వీచినప్పుడు ఆయా పట్టణాలు చేపల వర్షం కురిసిన సంఘటనలు ఇదివరకే వెలుగు చూశాయి. అయితే తాజాగా తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేపల వర్షం కురిసింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా నివ్వెరపోయారు.
మహదేవపూర్ మండలంలోని అన్నారంలో మంగళవారం అర్ధరాత్రి చేపల వర్షం కురిసింది. దీంతో గ్రామస్తులంతా చేపల పట్టుకుని తమ ఇళ్లలోకి తీసుకెళ్లారు. అయితే తెలంగాణ ప్రాంతంలో చేపల వర్షం కురవడంతో మత్స్యశాఖ అధికారులు స్పందించారు. నదులు, చెరువుల్లో సుడిగాలులు ఏర్పడినప్పుడు చేపలు ఎగిరి గాలి వెంట ప్రయాణిస్తాయని, వర్షం కురిసినప్పుడు నేలపైకి పడతాయని తెలిపారు.