ఇప్పటిదాకా ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క మారాలనుకుంటున్నారా? ఐతే ఈ మార్పులు చేసుకోండి.

-

మార్పు అంత తేలిక కాదు. అప్పటి వరకూ ఒకలాగా ప్రయాణిస్తున్న మీ జీవిత నావని ఒకేసారి ఇంకోలా తిప్పడం అంటే అంత సులభం కాదు. అలా అని మార్చలేనంత కష్టమూ కాదు. మార్పు రావాలంటే కొన్ని చిన్న చిన్న పనులను త్యాగం చేయాలి. అవేంటో తెలుసుకుని మార్పు తెచ్చుకోవడానికి వాటిస్థానంలో ఎలాంటి అలవాట్లు అలవర్చుకోవాలో తెలుసుకుందాం.

సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. పుస్తకాలకి దగ్గరగా ఉండండి. మీలో ఊహాశక్తిని పెంచేవి పుస్తకాలే.

కేవలం కలలు కంటూ కూర్చోవద్దు. వాటిని నిజం చేసుకోవడానికి పనులు మొదలెట్టండి.

మీ మీద మీరు కఠినంగా ఉండవద్దు. మృదువుగా ఉంటేనే మార్పు సాధ్యం అవుతుంది.

నిరాశలో కుంగిపోవద్దు. ఆశావాద దృక్పథాన్ని పెంచుకోండి.

ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు. నిన్న మీరెలా ఉన్నారు? ఈరోజు ఎలా ఉన్నారనేది చూసుకోండి.

ఇతరులను మీరింతే అనడం మానుకోండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో జీవితంలోని కొత్త కోణాలు కనిపిస్తాయి.

పగ, ప్రతీకారాలు పెట్టుకోవద్దు. అవి అవతలి వారికంటే మీకే ఎక్కువ హాని కలగజేస్తాయి. క్షమించి వదిలేయండి.

అవతలి వారు ఏదో ఇవ్వాలని ఆశపడవద్దు. మీరే అవతలి వారికి ఏదో ఒకటి ఇస్తూ ఉండండి.

ప్రతీ దానికీ అవును అని చెప్పే అలవాటును వెంటనే మానుకోండి. మీకు ఎలాంటి లాభమూ లేని పనులకు నో చెప్పేయండి. మొహమాటం అస్సలు వద్దు.

జీవితాన్ని ఎక్కువ సీరియస్ తీసుకోవద్దు. అలా తీసుకుంటే హాస్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే వీలైనంతా జాలీగా ఉండే ప్రయత్నం చేయండి. జీవితంలో అన్నింటికన్నా అదే ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Latest news