పాలు అమ్మే స్థాయి నుంచి.. నేడు బ్యాంక్ ఓనర్..సక్సెస్ స్టోరి..

-

కృషి ఉంటే మనుషులు దేన్నైనా సాధించవచ్చు అని ఇప్పటికే చాలా మంది రుజువు చేశారు.ఇప్పుడు మరో వ్యక్తి అందరికి ఆదర్సంగా నిలిచాడు..అతని సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఓ పాల వ్యాపారిగా ఉన్న వ్యక్తి దేశంలో ఒక బ్యాంకును స్థాపించగలడా. దానిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగలడా అంటే అవుననే చెప్పుకోవాలి..అతను పేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎలా చేరుకున్నాడు. అతడి విజయం వెనుక ఉన్న రహస్యాన్ని ఇప్పుడు చూద్దాం..శ్రద్ధగా పని చేయడం, మనపై మనం నమ్మకం ఉంచడం ద్వారా భవిష్యత్తును మెరుగు పరచుకోవచ్చు. ఇదే విషయాన్ని చంద్రశేఖర్ ఘోష్‌ విశ్వసించారు. ఒకప్పుడు డబ్బుకు ఆకర్షితుడై కోటీశ్వరుడు అయ్యాడు. ప్రస్తుతం చంద్రశేఖర్ ఘోష్ బంధన్ బ్యాంక్ CEO, మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. పేదరికం నుంచి జీవితానికి అవసరమైన సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకుని ప్రస్తుతం విజయాల బాటలో నడుస్తున్నారు. ఇది ఆయన జీవితంతో పాటు మిలియన్ల మంది జీవితాలను కూడా మార్చింది.

చంద్రశేఖర్ ఘోష్ త్రిపురలోని అగర్తలాలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. చంద్రశేఖర్ ఘోష్ తండ్రికి చిన్న స్వీట్ షాప్ ఉంది. అతడు చిన్నతనంలో పాలు అమ్మేవాడు. ఆశ్రమంలో అందించే ఆహారంతో కడుపు నింపుకునేవాడు. ట్యూషన్లు చెప్పి వచ్చిన డబ్బుతో చదువును కొనసాగించాడు. పశ్చిమ బెంగాల్‌లోని మహిళలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున రుణం ఇవ్వడం ద్వారా బంధన్ బ్యాంక్ యజమానిగా మారారు..

ఆయన తన కుటుంబ పోషణ కోసం 5000 జీతంతో చాలా కాలం పనిచేశారు.ఆ తర్వాత 1990ల చివరిలో.. వేరే ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో అతను బంగ్లాదేశ్‌లో మహిళా సాధికారత కోసం పనిచేస్తున్న విలేజ్ వెల్ఫేర్ సొసైటీ అనే NGOలో ప్రోగ్రామ్ హెడ్‌గా పనిచేయడం ప్రారంభించారు. అలాంటి మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తే అనేక చిన్న పరిశ్రమలు ప్రారంభించవచ్చని, ఆ మహిళల జీవితాలతో పాటు దేశ ప్రగతి కూడా బాగుంటుందనే ఆలోచనతో ముందుకొచ్చారు.

అతని కృషితో కొద్ది రోజుల్లోనే బంధన్ మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ దేశంలో ఉన్నత స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఈ బ్యాంక్ 2000 కంటే ఎక్కువ శాఖలను కలిగి ఉంది. 0 పోర్ట్‌ఫోలియో రిస్క్, 100% రికవరీ రేటుతో పని చేస్తోంది. ఇది సామాజిక మార్పుపై దృష్టి సారించిన ప్రముఖ ఏజెన్సీ అని చైర్మన్ అశోక్ లాహిరి చెప్పారు. కోల్‌కతాలోని ఒక చిన్న పట్టణంలో నివసిస్తున్న 25 మంది నిరుపేద మహిళలకు సహాయం చేయడానికి ఈ సంస్థను మొదట చంద్రశేఖర్ ఘోష్ ప్రారంభించారు. ఆ మహిళల సగటు ఆదాయం గతంలో రూ.300 మాత్రమే ఉండగా.. ప్రస్తుతం రూ.2000కు పెరిగింది. బ్యాంక్ ప్రస్తుతం రూ.30 వేల కోట్ల వ్యాపారాన్ని చేస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news