ఉబెర్ డ్రైవర్ గా అమ్మాయి..ఆమె ఎవరో తెలిసి షాక్..

-

అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించిన ఘటనలు చాలానే ఉన్నాయి..ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కరోనా కారణంగా ఉద్యోగాలను కోల్పోయారు..ఎన్నో రంగాలు కరోనా కారణంగా కుదేలయ్యాయి. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలా ఉద్యోగం కోల్పోయిన ఓ కోల్‌కతా మహిళ బతుకు తెరువు కోసం ఉబర్ బైక్ డ్రైవర్‌గా మారింది.బైక్ నడుపుతూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తోంది. రణ్‌బీర్ భట్టాచార్య అనే వ్యక్తి గత వారం కోల్‌కతాలో వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ఉబర్ బైక్ బుక్ చేశాడు.

బైక్ వేసుకుని వచ్చిన మహిళను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.రైడ్ సమయంలో ఆమె నుంచి వివరాలు సేకరించాడు. ఆ మహిళ పేరు మౌతుషి బసు. 30 ఏళ్ల వయసు కలిగిన ఆ మహిళ కరోనాకు ముందు పానసోనిక్ కంపెనీలో పని చేసింది. లాక్‌డౌన్ సమయంలో తన ఉద్యోగం కోల్పోయింది. ఆ తర్వాత రకరకాల ప్రయత్నాలు చేసి చివరకు ఉబర్ బైక్ డ్రైవర్‌గా స్థిరపడింది..తన కాళ్ళ మీద నిలబడింది..

కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉబర్ బైక్ డ్రైవర్‌గా మారడం తప్ప తనకు మరో దారి కనబడలేదని ఆమె చెప్పుకొచ్చింది.. చిన్న వయస్సులోనే ఆమె ఎంత కష్ట పడుతుందో తెలుసుకొని ఆమె కథ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఆమె చాలా ధైర్యంగా నిర్ణయం తీసుకుందని, వర్షం పడుతున్నా తన నుంచి ఆమె ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదని ఆమె గురించి చెప్పాడు. దాంతో అతని ఫ్రెండ్స్, ఫాలోవర్స్ ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news