స్ఫూర్తి: టీ అమ్మేవాడు… కానీ కలబంద సాగుతో లక్షల్లో లాభాలు..!

-

మన జీవితం ఎప్పుడు ఎలా మారుతుందనేది ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు మన రాతనే మార్చేస్తూ ఉంటాయి. అలానే ఈ టీ అమ్మే వ్యక్తి రాత కూడా తిరిగి పోయింది. అది కూడా కలబంద సాగు తో. మరి ఇక ఇతని కథ చూద్దాం. వివరాల్లోకి వెళితే అజయ్ స్వామి రాజస్థాన్ లోని హనుమాన్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి.

ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు. టీ అమ్ముతూ తన జీవనాన్ని కొనసాగించే వారు. కానీ అనుకోకుండా ఒక రోజు కలబంద సాగు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే తలరాత మొత్తం మారిపోయింది. లక్షల రూపాయలు ఇప్పుడు సంపాదిస్తున్నారు.

టీ అమ్మే వ్యక్తి ఇప్పుడు పెద్ద వ్యాపారవేత్తగా మారిపోయారు. ఒక రోజు న్యూస్ పేపర్ లో కలబంద సాగు గురించి చదివారు ఇంక అంతే అలోవెరా సాగు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తన ఊరిలోని రైతు ని కలిసి కలబంద సాగు గురించి బాగా తెలుసుకుని విత్తనాలు నుండి మొదలైన సమాచారాన్ని పొందాక స్టార్ట్ చేశారు.

2002లో టీ స్టాల్ మూసేసి కలబంద సాగు మీద ఫోకస్ పెట్టారు. కలబంద ని సాగు చేయడమే కాకుండా కలబంద తో ఏ ప్రొడక్టులను తయారు చేయొచ్చు అనేది కూడా నేర్చుకున్నారు. అలోవెరా జ్యూస్ ని ఎలా తయారు చేయాలో తెలుసుకుని బాటిల్ లో అలోవెరా జ్యూస్ ని వేసి అమ్మడం మొదలు పెట్టారు.

ఈ అలోవెరా జ్యూస్ ని అమ్మే కంపెనీలతో పార్ట్నర్ షిప్ ని కుదుర్చుకుని సప్లై స్టార్ట్ చేసారు. డిమాండ్ బాగా పెరగడంతో దీనినే కొనసాగించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే టర్నోవరు ఏడాదికి పది లక్షలుగా ఉంది. ఏకంగా 45 రకాల ప్రొడక్ట్స్ ని తయారుచేస్తున్నారు అలోవెరా లడ్డూ వంటివి కూడా తయారు చేస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అదిరే లాభాలను పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news