ఖమ్మం సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి కూణంనేని సాంబశివరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగస్వామ్యం లేని వారు ఆ పాత్రను హైజాక్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రస్తావన అంటేనే కమ్యూనిస్టులని.. వారు లేకుంటే తెలంగాణ లేదన్నారు. త్యాగం ఒకరిది భోగం ఒకరిదన్నారు. మతం పేరుతో, మతం పిచ్చితో ప్రజలను విచ్చిన్నం చేయాలని బిజెపి వాళ్లు చూస్తున్నారని మండిపడ్డారు.
సాయుధ పోరాటంలో చనిపోయిన వారిలో మీ పార్టీలకు సంబంధించిన వారు ఉన్నారా? అని ప్రశ్నించారు. నల్ల మట్టి ఎర్ర మట్టిగా అయిందంటే అది కమ్యూనిస్టుల రక్తంతోనే అని అన్నారు. సాయుధ పోరాటంలో ఏ పాత్ర లేనివాళ్లు బండి కింది కుక్కలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కమ్యూనిస్టు చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని డిమాండ్ చేశారు. కమలం మంచిదే కానీ.. బిజెపి కమలం కరోనా కంటే ప్రమాదం అన్నారు. గాడి తప్పిన కమ్యూనిస్టులను ఒకే మార్గంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.