ఒంటరిగా వచ్చిన ఈ జీవితంలో ఇతరులకు సాయం చేయాల్సిన అవసరం నిజంగా ఉందా? 

-

చుట్టూ ఇసుక తప్ప ఇంకేమీ కనిపించని ఎడారిలో ఇద్దరు మనుషులు చిక్కుకుపోయి ఉన్నారు. దారి వెతుకుతూ అలసిపోయి ఇక లేవలేక ఎండకు ఎండుతూ కూర్చున్నారు. బాగా దాహం వేస్తుంది. గుక్కెడు మంచి నీళ్ళ కావాలని అనుకుంటున్నా కదిలే శక్తి లేక అలాగే కూలబడ్డారు. నిస్సహాయంగా ఉన్న ఈ ఇద్దరి గురించి సాయం చేద్దాం అనుకున్న భగవంతుడు, వారికి కొద్ది దూరంలో ఒక ఒయాసిస్ ఏర్పాటు చేశాడు. అలసిపోయి అటూ ఇటూ కూస్తున్న ఈ ఇద్దరికీ ఒయాసిస్ కనిపించింది. వెంటనే కాళ్ళలో శక్తి వచ్చినట్లుగా లేచి, దానివైపు వెళ్ళసాగారు.

అప్పుడు ఆ ఒయాసిస్ ముందు ఒక ఎత్తైన గోడ కట్టబడి ఉంది. ఎడారిలో గోడ ఎలా ఉందా అని వారు ఆలోచించలేదు. ఆ గోడ వెనకాల నుండి వచ్చే శబ్దాలను విన్నారు. పచ్చని పైరు ఊగుతున్నప్పుడు వచ్చే శబ్దంతో పాటు పక్షల అరుపులు వినిపించసాగాయి. వెంటనే పైకి చూసారు. గోడ అంచుమీద పచ్చని ఆకులు కనిపిస్తున్నాయి. అటు పక్కగా ఉన్న చెట్టు నుండి వచ్చిన ఆకులు గోడ మీద పడుతున్నాయి. వెంటనే మరేమీ ఆలోచించకుండా ఒకడు పైకి ఎక్కేసి గోడకు అటువైపుగా వెళ్ళాడు. ఆ గోడ మీద నిల్చుని నవ్వుతూ నేనెళ్తున్నానన్నట్టు కింద ఉన్న వ్యక్తి వైపు చూసాడు.

కింద ఉన్న వ్యక్తి కూడా అదే చిరునవ్వుతో ఎడారివైపుకు నడిచాడు. తమతో పాటు వచ్చిన ఇతరులను కూడా తీసుకొద్దామన్న ఆలోచనతో.

మీ జీవితంలో మీకున్న సౌకర్యాలు మీతో పాటు ఉన్నవారికి ఉండకపోవచ్చు. అదృష్టమో, మరింకేదో కారణం వల్లనో మీలాగా అవకాశాలు రాకపోవచ్చు. అలాంటప్పుడు మీ చేయి అవతలి వారికి అందించి, వారిని కూడా పైకి తీసుకురావచ్చు. ఇది మీరు చేయగలరు. కానీ కొందరు చేయరు. మనం బాగానే ఉన్నాం కదా! ఇవన్నీ ఎందుకు అనుకుంటారు? నీతో పాటు సమానంగా నడవలేని వారికి చేయి అందించలేని నువ్వు, జీవితంలోని ఆనందాన్ని గ్రహించగలవా?

Read more RELATED
Recommended to you

Latest news