కాళ్లూచేతులు లేవు కానీ గుండెల్నిండా దైర్యం ఉంది బతికేయడానికి…!

-

ఆ పిల్లాడి వయసు 11 ఏళ్లు. పేరు టియో. కానీ.. సాధారణ పిల్లల్లా ఆడలేడు.. రాయలేడు.. ఏ పని చేయలేడు. ఎందుకంటే.. ఆ పిల్లాడికి కాళ్లు లేవు.. చేతులు లేవు. పుట్టడమే కాళ్లూచేతులు లేకుండా పుట్టాడు ఆ పిల్లాడు. కానీ.. నిజంగానే మిగితా పిల్లల్లా ఆ పిల్లాడు సాధారణ వ్యక్తి కాదు. విభిన్నమైన పిల్లాడు.

పుట్టిన తర్వాత ఓ సంవత్సరం వరకు టియోతో చాలా బాధలు ఎదుర్కొన్నారట ఆయన తల్లిదండ్రులు. తర్వాత ఆ పిల్లాడు తన పని తను చేసుకోవడం ప్రారంభించాడట. నోటితోనే అన్ని పనులు చేసుకోవడం, తన భుజాల సాయంతో ఇంట్లో గేమ్స్ ఆడటం లాంటివన్నీ చేస్తాడు టియో. రాయడం కూడా నోటితోనే. ఇక.. చదువులో అయితే టియో నెంబర్ వన్. మ్యాథ్స్ అంటే టియోకు చాలా ఇష్టమట. ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్న టియో.. నాలుగో తరగతి ప్రాబ్లమ్స్ ను కూడా ఇట్టే సాల్వ్ చేసేయగలడట. అతడికి ఐక్యూ కూడా బాగా ఉందని స్కూల్ టీచర్లు చెబుతున్నారు. అన్నీ ఉన్నా ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండేవాళ్లు కనీసం ఈ పిల్లాడిని చూసి అయినా నేర్చుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news