సక్సెస్ స్టోరీ: సాప్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం…లక్షల్లో ఆదాయం..!

-

మనం చేసే ప్రతీ పనిలోనూ మనకు సంతృప్తి కలగదు కానీ నిజానికి మనం అనుకున్న పని పూర్తి చేస్తే ఆ ఆనందమే వేరు. నిజానికి అదే నిజమైన సక్సెస్ కూడా. డబ్బులు వస్తున్నాయి కదా అని మనకి నచ్చని ఉద్యోగం చేయడం వల్ల మనకు ఏ మాత్రమూ సంతృప్తి కలగదు. పైగా జీవితాంతం ఏదో వెలితి ఉండిపోతుంది. దానికి బదులుగా మనం మనకి నచ్చిన దాన్ని ఎంచుకుని అందులో రాణిస్తే ఖచ్చితంగా సంతృప్తి ఉంటుంది పైగా ఏదో ఆనందం ఉంటుంది.

 

సాఫ్ట్వేర్ ఉద్యోగం లో పనిచేసే ఈ ఉద్యోగి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకొని వ్యవసాయం లోకి వచ్చారు. ఇప్పుడు లాభాలను పొందుతున్నారు మరి ఇక సాఫ్ట్వేర్ నుంచి వ్యవసాయం లోకి వచ్చిన అతని కథ చూద్దాం…. ఈ మధ్యకాలంలో చదువుతో చేసే ఉద్యోగంతో సంబంధమే లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు.

ఈ యువకుడు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ చదివి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఒక కంపెనీలో పని చేశారు. కానీ ఉద్యోగంలో సంతృప్తి దొరకక వ్యవసాయం మీద ఆసక్తి ఉండటంతో ఉద్యోగాన్ని వదిలేసుకుని వ్యవసాయం లోకి వచ్చారు. అందరిలా కాకుండా కాస్త భిన్నంగా వ్యవసాయాన్ని చేసి అధిక లాభాలను పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కి చెందిన రాజేష్ కుమార్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవారు .తర్వాత పుట్టగొడుగుల పెంపకం లో ఆసక్తి ఉండడం వలన ఇప్పుడు లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఐదేళ్ల క్రితం లక్ష రూపాయలతో పుట్టగొడుగుల పెంపకం మొదలుపెట్టారు రాజేష్. పాల పుట్టగొడుగుల పెంపకం లో జ్ఞానాన్ని పొంది తర్వాత మొదలు పెట్టారు.

120 గ్రాముల పుట్టగొడుగు విత్తనాలని ఒక కవర్లో చుట్టి తర్వాత ఒక అంగుళం మందంతో వరి గడ్డి చుట్టేసి మళ్లీ విత్తనాలు మళ్లీ వరి గడ్డి ఇలా అయిదు సార్లు ఒక పాలిథీన్ కవర్లో తయారు చేశారు. ఈ కవర్లను ఒక చీకటి గదిలో పెట్టి జాగ్రత్తగా ఉంచారు. ఫంగస్ పుట్టిన తర్వాత గాలి, వెలుతురు ఉండే చోటకి మార్చారు. పది రోజుల తర్వాత మొదటి కాపు చేతికి వస్తుంది.

తర్వాత నీళ్ళు చల్లాలి. కొన్ని రోజులకి మరో కాపు వస్తుంది. ఇలా ఈ విధంగా అనుసరించారు రాజేష్. కిలోని 200 నుంచి 300 వరకు అమ్ముతున్నారు. అదే ఎండబెట్టినవి అయితే 800 వరకు అమ్ముతున్నారు నెలకు మొత్తం నాలుగు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. కేవలం సంతృప్తి మాత్రమే కాదు ఆదాయంను కూడా చక్కగా పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news