మిజోరాంలోని సిహ్‌పురి మార్కెట్‌లో లల్రిన్నుంగితోపాటు ఆమె కుటుంబ సభ్యులు అందరూ కూరగాయలు అమ్ముకుంటుంటారు. అదే వారికి జీవనాధారం.
కష్టపడి చదువుకోవాలనే తపన ఉండాలే గానీ అందుకు పేదరికం ఏమాత్రం అడ్డంకి కాదు. ఎంతో మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు కూడా ఇప్పుడు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు. చాలా మంది ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్మింది కాబట్టే ఆ బాలిక ఓ వైపు పేదరికంలో మగ్గుతున్నప్పటికీ చదువుల్లో మాత్రం రాణిస్తోంది. ఆమే.. మిజోరాంకు చెందిన లల్రిన్నుంగి. ఈమె ఓ వైపు కూరగాయలు అమ్ముకుంటూనే మరో వైపు పరీక్షల్లో టాపర్‌గా నిలిచింది.
మిజోరాంలోని సిహ్‌పురి మార్కెట్‌లో లల్రిన్నుంగితోపాటు ఆమె కుటుంబ సభ్యులు అందరూ కూరగాయలు అమ్ముకుంటుంటారు. అదే వారికి జీవనాధారం. ఈ క్రమంలోనే తనకు ఖాళీ దొరికిన సమయాల్లో ఓ వైపు లల్రిన్నుంగి కూరగాయలు అమ్ముతూనే మరో వైపు కష్టపడి చదివింది. ఈ క్రమంలోనే ఆమె అక్కడ తాజాగా నిర్వహించిన హెచ్ఎస్ఎల్ఈ రిజల్ట్స్‌లో 500 మార్కులకు గాను 486 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది.
లల్రిన్నుంగి కుటుంబం సిహ్‌పురిలోని ఓ చిన్న అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. వారి తల్లిదండ్రులకు కూరగాయలు అమ్ముకోవడమే జీవనాధారం. ఈ క్రమంలో లల్రిన్నుంగి అక్కడి సర్ పియెర్రెస్ యంగ్ లెర్నర్ స్కూల్‌లో కష్టపడి చదివింది. దీంతో పరీక్షల్లో టాపర్‌గా నిలిచింది. ఆమె ఇలా ప్రతిభ కనబరిచినందుకు గాను అందరూ ఇప్పుడామెను అభినందిస్తున్నారు. కాగా లల్రిన్నుంగి మాత్రం తనకు సివిల్స్ చదవాలని ఉందని చెబుతోంది. ఆమె కల నెరవేరాలని మనమూ ఆశిద్దాం..!