సాధారణంగా చాలా మంది ఏదో ఒక విషయాన్ని పట్టుకుని దాన్ని ఆలోచిస్తూ ఉంటారు. అతిగా ఆలోచించడం వల్ల ఎన్నో పనులు చేయలేరు. అలానే ఆనందంగా కూడా ఉండలేరు. అతిగా ఆలోచించడం మానుకోవడం ముఖ్యం. మీరు కూడా అతిగా ఆలోచించి ఇబ్బంది పడుతున్నారా…? అయితే ఈ పద్ధతిని అనుసరించి దాని నుంచి బయట పడండి. దీనితో మీరు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం దీని కోసం ఇప్పుడే తెలుసుకోండి.
ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తెలుసుకోండి:
సాధారణంగా ఏదో ఒక విషయాన్ని పట్టుకొని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే మీరు ఆ సమయాన్ని గుర్తించండి. మీరు ఎప్పుడైతే అతిగా ఆలోచిస్తున్నారో ఆ క్షణంని గుర్తించండి. వెంటనే మీరు దాన్ని అదుపు చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఆలోచనల్ని డైవర్ట్ చేసి దీని నుండి బయట పడవచ్చు.
పరిష్కారం ఆలోచించండి:
అతిగా ఆలోచించడం కంటే దాన్ని వెంటనే సాల్వ్ చేసుకోవడం బెటర్. ఒకవేళ కనుక మీరు ఆ సమస్యని పరిష్కరించ లేరు అని అనుకుంటే కనుక మీ నడవడికని, ఆలోచనా విధానాన్ని మార్చుకోండి.
మీ ఆలోచనలతో ఛాలెంజ్ చేయండి:
నెగిటివ్ ఆలోచనల్ని పక్కన పెట్టేస్తే మీరు దీని నుంచి బయటపడి పోవచ్చు. ఆలోచనలు వస్తూ ఉండడం సహజం. కాబట్టి నెగెటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మీరు వెంటనే ఆ సమస్య నుండి గట్టెక్కడానికి ప్రయత్నం చేయండి.
మైండ్ ని రిఫ్రెష్ గా ఉంచండి:
మీరు మీ మైండ్ ని ప్రశాంతంగా ఉంచండి. ఎప్పుడు అతిగా ఆలోచించకుండా పుస్తకాల ద్వారా లేదా ఇతర వీడియోలు లేదా ఆప్స్ నుండి మైండ్ ఫుల్ స్కిల్స్ ని ప్రయత్నం చేయండి. ఇలాంటివి కనుక మీరు చేస్తే దీని నుంచి సులభంగా బయటపడవచ్చు.