వావ్..ఒక్క ఐడియా..దేశాన్ని క్లీన్ చేస్తుంది..

-

ఒక ఐడియా అతని జీవితాన్ని పూర్తిగా మార్చి వేసింది..ఇది అక్షరాల నిజం..ఒక ఐడియా యువకుడికి మంచి పేరును తీసుకోని వచ్చింది.ఆ ఐడియా వల్ల సెలెబ్రేటి అయ్యాడు.ఎక్కడ చూసిన తన పేరు మారు మోగి పోతుంది..వావ్ ఇలాంటి మాటలు అందరూ అంటుంటే ఎంత బాగుంటుందో కదా.. ఓ యువకుడు చేసిన పనికి ఇప్పుడు అందరు అతన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.ఎంత గొప్ప ఐడియా అయినా సరే, కష్టంతోనే సాకారం అవుతుంది’ అని నమ్మే దివాన్షు కుమార్‌ దివ్యమైన ఆవిష్కరణకు తొలి బీజం వేశాడు…

 

మనదేశంలో ప్రతిసంవత్సరం సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రపరిచే క్రమంలో అందులోని విషపూరితాల వల్ల ఎంతోమంది చనిపోయారు. చనిపోతున్నారు.అనేక రంగాలలో రోబోలను విజయవంతంగా ఉపయోగిస్తున్నారు, సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రపరచడంలో ఎందుకు ఉపయోగించకూడదు అనే ఆలోచన చేసాడు.ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మద్రాస్‌ విద్యార్థి దివాన్షు కుమార్‌.

ఫైనల్ ఇయర్‌ మాస్టర్స్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రపరిచే మానవరహిత రోబోకు రూపకల్పన చేశాడు.ఈ రోబో ను ఇంకాస్త ముందుకు సాగాడు. అందులో భాగంగా అతని ఐడియా నచ్చి కొందరు అతనికి సపోర్ట్ గా నిలిచారు.తొలిసారిగా ఈ రోబోలు తమిళనాడులో పనిలోకి దిగబోతున్నాయి. ఉద్వేగంలో ఒక నిర్ణయానికి రాకుండా, అది ఏ రకంగా గొప్పదో ఒకటికి పదిసార్లు ఆలోచించుకున్నప్పుడే, అందులో గొప్పదనం ఎంతో తెలుస్తుంది..మొత్తానికి అతని ఆలోచన చూపరులను బాగా ఆకట్టుకున్నాయి..ఐడియా టోటల్ వ్యవస్థ ను మార్చివేసింది.. రియల్లీ గ్రేట్..ఆల్ ది బెస్ట్..

Read more RELATED
Recommended to you

Latest news