చెత్తకుప్పలో పడేసిన రూ. 5లక్షల విలువైన బంగారం.. సీన్‌ కట్‌ చేస్తే ఎలుకలు అలా..

-

కొంతమందికి..కంగారు ముందు ఉంటుంది. ఈ టెన్షన్‌లో ఒకటి అనుకుని..ఇంకోటి చేసేస్తుంటారు. చాలామంది.. ఆఫీస్‌కు వెళ్లే కంగారులో..టిఫెన్‌ బాక్సులు మర్చిపోతుంటారు.. మనం కూడా.. ఇంట్లో ఒక చోట పెట్టింది.. మరో చోట వెతుకుతుంటారు.. కొందరు తమ వస్తువులను అజాగ్రత్తగా పాడేసుకుంటుంటారు. ఇలాంటిదే వింత ఘటన ఒకటి జరిగింది.. ముంబైలోని గోరేగావ్‌లో బంగారాన్ని ఓ మహిళ చెత్తలో పడేసింది..! ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

గోకుల్ ధామ్ కాలనీకి చెందిన 45 ఏళ్ల సుందరి ప్లానిబెల్ అనే మహిళ.. ఒక ఇంటిలో పనిచేసేది. ఈ క్రమంలో ఆమె.. తన బంగారాన్ని బ్యాంక్ లాకర్‌లో పెట్టడానికి వెళ్లింది. అయితే, ఆమె వెళ్లేటప్పుడు వడపావ్‌లను ఒక కవర్‌లో పెట్టుకుని వెళ్లింది. ఇక దానితో పాటే.. బంగారం ఉన్న బ్యాగ్‌ను కూడా అదే కవర్‌లో పెట్టింది. దానిలో ఆమె 5 లక్షల విలువైన బంగారం బ్యాగ్‌ను పెట్టింది. వెళ్లేటప్పుడు వీధిలో కొంత మంది వీధిబాలలు కన్పించారు. ఆమె వడపావ్ కవర్‌ను వాళ్లకి ఇచ్చేసింది. దానిలోనే బంగారం కవర్ కూడా ఉందని ఆమె మర్చిపోయింది.

బ్యాంక్‌కు వెళ్లి చూసుకునే సరికి అప్పుడు ఆమెకు గుర్తోచ్చింది.కాసేపటికి ఆమె చేసిన పొరపాటు తెలుసుకుని.. వెంటనే పరిగెత్తుకుంటూ పొద్దున పిల్లలు ఉన్న స్థలానికి వెళ్లింది. అక్కడికి వచ్చి పిల్లల కోసం వెతికింది. కానీ ఏం ప్రయోజనం.. పిల్లలు ఆమెకు కన్పించలేదు. సుందరి ప్లానిబెల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోనికి దిగిన అధికారలు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. వీధిబాలలను గుర్తించారు. కవర్ గురించి ఆరా తీయగా.. తమకు వడపావ్ నచ్చలేదని చెత్త కుప్పలో పాడేశామని పిల్లలు అన్నారు. వెంటనే అక్కడి చెత్తకుప్పలో వెతకగా.. బంగారం కవర్ చినిగిపోయి కన్పించింది. అక్కడ చైన్‌లు ఉండటం ఆమె చూసింది.

వెంటనే వాటిని తీసుకుంది. కొన్ని ఎలుకలు అక్కడ కవర్ ను చింపేసి, వడపావ్ తింటున్నాయి. వెంటనే మహిళ కవర్‌ను తీసేసుకుంది. మొత్తానికి పొయిందనుకున్న బంగారం దొరకడంతో ఆమె ప్రాణం తిరిగి వచ్చినట్లైంది. పోలీసులు ఆమెకు బ్యాగ్, బంగారం అప్పగించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చాలామంది.. బాగా జాగ్రత్తగా చేయాలనుకున్న పనిలోనే ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. అదృష్టం బాగుంది కాబట్టి.. పోయిన సొమ్ము దొరికింది.

Read more RELATED
Recommended to you

Latest news