మద్యం సేవిస్తే మెదడు పని చెయ్యదు అన్న విషయం అందరికి తెలిసిందే..అప్పుడు మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా పోతుంది.. అందరి సంగతి పక్కన పెడితే, ఓ వ్యక్తి 20 ఏళ్లుగా మద్యం తాగుతున్న వ్యక్తి ఇటీవల ఒకరోజు మద్యం తాగాడు. ఆ మద్యం అతనికి కిక్ ఇవ్వలేదు. దీంతో అది నకిలీ మద్యం అని అధికారులకు, హోం మంత్రికి ఫిర్యాదు చేశాడు.. మొదట అందరు కోపం తెచ్చుకున్న కూడా తర్వాత నవ్వుకున్నారు.. అంత మత్తులో కూడా అతని బ్రెయిన్ బాగా పని చేస్తుందని ప్రశంసలు కురిపించారు.
అసలు విషయాన్నికొస్తే..మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయినిలోని బహుదూర్ గంజ్ ప్రాంతానికి చెందిన లోకేష్ సోథియా పెయిడ్ పార్కింగ్ స్టాండ్ నిర్వహిస్తూ ఉంటాడు. ఏప్రిల్ 12న స్ధానికంగా ఉన్నమద్యం దుకాణంలో నాలుగు సీల్డ్ క్వార్టర్ల స్వదేశీ మద్యం సీసాలు కొనుక్కున్నాడు. తర్వాత తన ఫ్రెండ్ తో కలిసి మందును తాగాడు.ఆ మద్యం కిక్ ఇవ్వలేదు. తనకు మద్యం కిక్ ఇవ్వకపోవటంతో అది కల్తీ మద్యంగా భావించాడు. మద్యంలో నీళ్లు కలిపారని ఆరోపించాడు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రాతో పాటు ఉజ్జయిని ఎక్సైజ్ కమీషనర్ ఇందర్ సింగ్ దామోర్ కు ఈ విషయమై ఫిర్యాదు చేశాడు..
మద్యం అమ్మిన షాపుపై వినియోగ దారుల కోర్టును కూడా ఆశ్రయించాడు. తాను గడిచిన 20 ఏళ్లుగా రోజు మద్యం సేవిస్తానని లోకేష్ సోథియా తెలిపాడు.. కల్తీ మద్యం అమ్మి జనాలను మోసం చేస్తున్న దుకాణ దారుల పై తక్షణం విచారణ జరపాలని కోరారు. అతని ఫిర్యాధు ఇప్పుడు పెద్ద తలలకు షాక్ ఇచ్చింది.ఇలా అడగడం తప్పు లేదు. మన హక్కులను గుర్తు చేశాను అంటూ అందరినీ పోగు చేశాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొందరు అతని ఫిర్యాదు పై మద్దతు తెలిపి సపోర్ట్ గా నిలిచారు.