ఓ మహిళ ఖాతాలో పొరపాటున అక్షరాల రూ. 57 కోట్లు జమ..మొత్తం ఖర్చుపెట్టేసింది..

-

బ్యాంక్‌ అకౌంట్లో కొన్నిసార్లు మనకు తెలియకుండానే పెద్ద మొత్తంలో డబ్బు జమ అవుతుంది. అది సాఫ్ట్‌వేర్‌ ఇష్యూ వల్ల అలా జరుగుతుంది. కొన్నిసార్లు కోట్లకు కోట్లు డబ్బు అకౌంట్‌లో పడుతుంది. అదేంటో ఇలాంటి ఘటనలు అన్నీ వాళ్లకు వీళ్లకు జరుగుతాయి కానీ మనకు ఎప్పుడూ జరగవేంటో..! అయితే అకౌంట్‌ అంతంత మనీ పడినా..కొద్ది సేపటికే మళ్లీ వెనక్కి తీసుకుంటారు. అయితే ఇక్కడ కాస్త వెరైటీ సీన్‌ జరిగింది. ఓ మహిళ అకౌంట్‌లోకి కోట్లకు కోట్లు డబ్బులు పడ్డాయి.. ఆమె ఆ మొత్తాన్ని ఖర్చుచేసేసిందంట.. ఆ తర్వాత ఏం జరిగిందంచే..
ఈ ఆస్ట్రేలియన్ మహిళ ఖాతాలో అకస్మాత్తుగా £6.25 మిలియన్లు జమ అయ్యాయి. క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ సైట్ అయిన క్రిప్టో.కామ్ ద్వారా మెల్‌బోర్న్‌కు చెందిన తేవమనోగారి మణివేల్ ఖాతాలో ఈ మొత్తం జమ చేసింది. మే 2021లో ఆమె ఈ సైట్‌తో కొన్ని లావాదేవీలు చేసింది. ఇందులో కంపెనీ ఆమెకు వంద డాలర్లు అంటే దాదాపు ఎనిమిది వేల రూపాయలు వాపసు ఇవ్వాల్సి వచ్చింది. కానీ పొరపాటున ఆమె ఖాతాలోకి రూ. 57 కోట్లు పంపించారు.
ఈ డబ్బుతో తన సోదరితో కలిసి ఆమె చాలా ఎంజాయ్ చేసింది. మెల్‌బోర్న్‌లో ఐదు పడక గదుల ఇంటిని కూడా కొనుగోలు చేసింది. అయితే ఏడు నెలల తర్వాత కంపెనీ తన తప్పును గుర్తించింది. కోర్టును ఆశ్రయించిన కంపెనీ ఇప్పుడు తమ డబ్బు కోసం ఎదురుచూస్తోంది. ఇంటిని విక్రయించి, డబ్బును క్రిప్టో.కామ్‌కి తిరిగి ఇవ్వాలని కోర్టు మహిళను ఆదేశించింది.
మనీవెల్ తన ఖాతాలో వచ్చిన డబ్బు మొత్తం ఖర్చు చేసింది. కానీ క్రిప్టోకరెన్సీ సైట్ ఆ మహిళ డబ్బు మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. తన 57 కోట్లకు 10 శాతం వడ్డీ అడుగుతున్నారు. అయితే.. ఆమెపై చట్టపరమైన ఖర్చును కూడా తిరిగి పొందాలని చూస్తోంది. ఆస్ట్రేలియన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంపెనీ లాయర్ జస్టిన్ లారెన్స్ మాట్లాడుతూ.. ముందుగా ఎవరైనా అకస్మాత్తుగా తమ ఖాతాలో అంత డబ్బు వస్తే.. బ్యాంకుకు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఇది మీకు ఇవ్వాల్సిన డబ్బు కాకపోతే, మీరు దానిని తిరిగి ఇవ్వవలసి ఉంటుంది.
పాపం..ఇప్పుడు ఆ మహిళ పరిస్థితి ఏంటో.. అదృష్టం వచ్చినట్లే వచ్చి బోర్లా పడేసినట్లు అయింది. మనదికానిది మనతో నిలవదు అని పెద్దలు ఊరికే అనరేమో.!

Read more RELATED
Recommended to you

Latest news