బస్సులో కుర్చోగానే కాళ్లకింద కనిపించింది ఓ ఏటీఎం కార్డు.. పైన పిన్ నంబర్ కూడా ఉంది.. ఇక ఏం చేశాడంటే..!

మనకు వచ్చే అదృష్టం పక్కోడికి దురదృష్టం కాకూడదు..అంతేకదా.. ఒకడి కష్టాన్ని దోచుకుని దాచుకుందాం అనుకోవటం ముమ్మాటికి తప్పే..ఏంటి మోటీవేషన్ స్పీచ్ ఇస్తున్నా అనుకుంటున్నారా.. అలాంటిదేంలేదండీ…. ఇప్పుడు చెప్పబోయే వార్త చదివాక మీరు ఆ ప్లేస్ లో ఉంటే ఏం చేస్తారో కమెంట్ చేయండి. ఎవరో ఒక అమాయకుడు ఏటీఎం కార్డుమీద మర్చిపోతానేమో అనుకుని పిన్ నంబర్ కూడా రాశాడు. రాసినోడు జాగ్రత్తగా పెట్టుకున్నాడా అంటే..పాపం జాగ్రత్తగానే పెట్టుకుని ఉంటాడు..ఏదో ఫేట్ అలా అయిపోయి అది కాస్త పోగుట్టుకున్నాడు.. కట్ చేస్తే ఎకౌంట్ లో ఉన్న సొమ్మంతా ఖాళీ అయిపోయింది. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బస్సు ఎక్కి సీట్ లో కుర్చున్న ఓ వ్యక్తికి ఆ కార్డు దొరికింది. అనుమనంగానే తీసి చూశాడు. దానిపైన పిన్ నంబర్ కూడా రాసి ఉండేసరికి పంటపడింది అనుకున్నాడు. డౌట్ డౌట్ గానే ఏటీఎంకు వెళ్లి ఎంత బ్యాలెన్స్ ఉందా అని చెక్ చేశాడు. చూస్తే 73 వేల రూపాయల బ్యాలెన్స్ కనిపించింది. అంతే రూపాయి కూడా మిగల్చకుండా మొత్తం డ్రా చేసేశాడు. డబ్బులు డ్రా చేసినట్లు మెసేడ్ రావటంతో బాధితుడు అప్పుడు కార్డు బ్లాక్ చేశాడు.

హర్యానాలోని హిసార్ జిల్లాకు చెందిన రతన్ లాల్ అనే వ్యక్తి తన ఏటీఎమ్ కార్డు మీదే పిన్ నెంబర్ రాసుకున్నాడు. దానిని ఓ బస్సులో పారేసుకున్నాడు. అదే రోజు సాయంత్రం అతడి మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. రూ.73 వేలు విత్ డ్రా అయినట్టు సమాచారం వచ్చింది. దీంతో అతను వెంటనే ఏటీఎమ్ కార్డును బ్లాక్ చేసి. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు.

అసలు ఏటీఎం కార్డుని పోగొట్టుకోవటమే ఒక తప్పు.. ఇంకా ఆ కార్డుమీద నంబర్ రాసుకోవటం పెద్ద బ్లండరే.. ఎప్పుడూ కూడా కార్డుమీద అలా నంబర్ రాయకూడదు. మర్చిపోతాం అని చాలామంది ఇదే తప్పుచేస్తుంటారు. అంతలా మర్చిపోతాం అనుకుంటే.. ఫోనులో సేవ్ చేసుకోవటమో, నోట్స్ లో రాసుకోవటమే చేయాలి. అంతేకాని పోయి పోయి కార్డుమీద రాయకూడదు. బ్యాంకుల లావాదేవీల విషయంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి, ఎవరు అడిగనా సరే ఓటీపీ, పిన్ నంబర్ చెప్పొద్దు అని బ్యాంకులు ఎప్పటకప్పుడు చెప్తూనే ఉంటాయి.. కానీ చాలామంది అమాయకులు నేరగాళ్ల చేతుల్లో పడిదెబ్బతింటున్నారు.

ఇప్పుడు మీరే చెప్పండి.. ఒకవేళ మీకు ఆ కార్డు దొరికితే మీరు కూడా ఆ దొంగలానే చేస్తారా..లేక ఇంకేం చేస్తారో. అంతేకాదు.. మీ ఆత్మీయుల్లో ఎవరికైనా ఇలా కార్డుల మీద నంబర్ రాసుకునే అలవాటు ఉంటే..వారికి ఈ వార్త షేర్ చేసి అప్రమత్తం చేయండి.

– Triveni Buskarowthu