పీకే డైరెక్షన్ తోనే కేసీఆర్ ఆందోళన, భౌతిక దాడులు – ఎమ్మెల్యే రఘునందన్ రావు

టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ భాషపై మేధావులు చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. అటువంటి భాష వాడిన కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో ఉండటం సరైదేనా అని ప్రశ్నించారు.

ఇటీవల కేసీఆర్ ప్రముఖ్య ఎన్నిక వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కలుస్తున్నారని.. పీకే డైరెక్షన్ లోనే కేసీఆర్ ఆందోళనలు, భౌతిక దాడులకు చేస్తున్నారు ఆరోపించారు. అసెంబ్లీ నియోజకవర్గాలు డీలిమిటేషన్ అవ్వడం లేదనే కేంద్రంపై కేసీఆర్ కక్ష కట్టారు. ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లోకి నాయకులను చేర్చుకున్నారని.. డీ లిమిటేషన్ జరిగితే మరికొంత మందికి టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారని..మరోవైపు బీజేపీ మింగేస్తుందనే భయంతోనే ఆందోళన చేస్తున్నారని దుయ్యబట్టారు రఘునందన్ రావు.

హిందువుల గురించి మాట్లాడితే బీజేపీని మతతత్వ పార్టీ అంటున్నారని .. ఇదే కేసీఆర్ నిత్యం నిజాంను పొగుడుతున్నారని .. ఇది మతతత్వ కాదా.. అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి పాలమూరుకు ఎన్ని నీళ్లు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలని అన్నారు. కేసీఆర్ ఆరోపణలపై బీజేపీ బహిరంగ చర్చకు సిద్ధంగా ఉందని.. వరి సాగుపై శాస్త్రీయ చర్చకు కేంద్ర మంత్రులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.