భవిష్యత్తులో బిజినెస్ చేయాలనుందా? ఐతే తర్వాతి తరంలో డిమాండ్ ఉన్న రంగాలివే..

-

బిజినెస్.. చాలా మందికి వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటుంది. కొందరు మొదలెడతారు కూడా. కానీ సక్సెస్ అయ్యేది చాలా తక్కువ మంది. బిజినెస్ స్థాపించి దాన్ని లాభాల బాట పట్టించడం చిన్న విషయం కాదు. ఉద్యోగం చేసే చాలా మంది బిజినెస్ లోకి రావడానికి ముఖ్య కారణం, ఒకరి కింద పనిచేస్తున్నామన్న భావనతోనే. అలంటి భావన ఉన్నన్ని రోజులు బిజినెస్ లో పైకి ఎదగలేరు. అవును, ఏ పనైనా ఒకరి కింద పనిచేయాల్సిందే. బిజినెస్ అయినా కస్టమర్ కి తగ్గట్లుగా పని చేయాల్సిందే.

అదలా ఉంచితే, వ్యాపారం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, భవిషత్తులో వ్యాపారం చేయాలని ఆశపడేవారు. ఏ బిజినెస్ లోకి దిగితే బాగుంటుందో ఆలోచించేవాళ్ళు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలని ఇక్కడ చూద్దాం. బిజినెస్ మేన్ అనేవాడు అప్పుడు ఉన్న పరిస్థితి గురించి మాత్రమే ఆలోచించవద్దు. రేపు జరగబోయే పరిస్థితులని అంచనా వేయాలి. దానికి తగినట్లుగా అతడి వ్యాపార ఆలోచనలు ఉండాలి. అందుకే వచ్చే కాలంలో మంచి డిమాండ్ ఉండే కొన్ని వ్యాపారాలని చూద్దాం.

వ్యవసాయం

ఇది వ్యాపారం అని చెప్పుకోకూడదు కానీ, వచ్చే కొన్ని సంవత్సరాల్లో వ్యవసాయానికి మంచి డిమాండ్ ఉండనుంది. రోజు రోజుకీ వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోవడమే దానికి కారణం. ఇప్పుడు చాలా తక్కువ ఆదాయం పొందుతున్న ఈ మార్గం భవిష్యత్తులో బంగారు మయం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

గ్రీన్ ఎనర్జీ

సోలార్, విండ్, నుండి వస్తున్న విద్యుత్ కి గిరాకీ బాగా పెరగనుంది. ప్రస్తుతం చాలా చోట్ల సోలార్ ప్లాంట్లు స్థాపించబడ్డాయి. మరికొద్ది రోజుల్లో విండ్ మిల్స్ కూడా పేరిగే అవకాశం ఉంది.

ఈ కామర్స్

ఇప్పటికే ఇందులో పెద్ద సంచలనమే రేగింది. భవిష్యత్తులో ఇది ఇంకా టాప్ కి వెళ్తుందనడంలో ఆశ్చర్యం లేదు.

డేటాసైన్స్

ప్రస్తుతం అంతగా అందుబాటులోకి రాకపోయినా, డేటా సైన్స్ అనేది విప్లవాత్మకమైన మార్పులని తీసుకురానుంది. సమాచార రంగంలో ఇదో చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news