మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ కి బాగా అలవాటు పడిపోయారా..? అయితే ఇలా చెయ్యండి..!

-

ఈ మధ్య కాలం లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ కి బానిసలై పోతున్నారు. కేవలం పెద్ద వాళ్ళు మాత్రమే కాదు పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ కి బాగా అలవాటు పడిపోయారు. ముఖ్యంగా ఆన్లైన్ క్లాసులు వచ్చినప్పటి నుంచి కూడా పిల్లలు స్మార్ట్ ఫోన్ కి బాగా దగ్గరయ్యారు. అయితే నిజంగా ఈ సమస్యతో తల్లిదండ్రులు విసిగిపోతున్నారు.

 

ఎలా అయినా వాళ్లని స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉంచాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు అయితే ఏకంగా సైకాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తున్నారు. మీరు కూడా మీ పిల్లలతో ఇబ్బంది పడుతున్నారా..?, వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ కి బాగా దగ్గర అయిపోయారా..?, ఆ అలవాటును మాన్పించాలి అని అనుకుంటున్నారా..? అయితే ఈ టిప్స్ ని మీరు చూడాల్సిందే.

నిజానికి స్మార్ట్ ఫోన్ కి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి పిల్లలు అలవాటు పడ్డారు అంటే దానికి కారణం తల్లిదండ్రులే. అందుకని మొదట వాళ్ళని అస్సలు నిందించకండి. ఇది కష్టమైనా సరే ఓపికతో మీరు మాన్పించడానికి ప్రయత్నం చేయండి.

పిల్లలు స్కూల్ నుంచి రాగానే బయటకి తీసుకువెళ్లి ఆడించండి. దగ్గర్లో ఏదైనా పార్క్ కానీ లేదంటే ఏదైనా మైదానం కానీ ఉంటే వాళ్ళతో కాసేపు ఆడండి. ఆటలు ఆడడం లేదంటే స్విమ్మింగ్ నేర్పించడం వంటివి చేయండి. దీనితో వాళ్ళు డైవర్ట్ అవుతారు. సంగీతం డాన్స్ వంటివాటిలో చేర్పించడం వల్ల ఫోన్ పై ఆసక్తి తగ్గుతుంది. అందుకని తల్లిదండ్రులు జాగ్రత్తగా వాళ్లని ఇటువంటి వాటికి అలవాటు చేసి స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉంచండి.

ఒకవేళ మీ పిల్లలు పెద్ద వాళ్ళు అయితే ఇంటి పనులు చెప్పండి. దీనితో వాళ్ళు స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉండడానికి అవుతుంది ఇలా ఈ విధంగా తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ నుంచి పిల్లలను దూరంగా ఉంచడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news