లేనిది ఉన్నట్లు.. ఎవరూ పిలవకపోయినా పిలిచినట్లు అనిపిస్తుందా..?

-

దెయ్యాల సినిమాలు చూస్తుంటే.. అందులో ఏవేవో శబ్ధాలు వినిపించినట్లు, అక్కడ ఎవరూ లేకపోయినా ఉన్నట్లు చూపిస్తారు.. కొన్నిసార్లు నిజజీవితంలో కూడా అలానే అనిపిస్తుంది. లేనిది ఉన్నట్లుగా.. ఏవో శబ్ధాలు వినిపించినట్లుగా..ఎవరూ మనల్ని తాకకపోయినా.. సడన్‌గా ఎవరో తాకినట్లు ఫీల్‌ అవుతాం.. ఇదంతా హేలూసినేషన్‌ అని ఇంగ్లీష్‌లో అంటారు.. దీన్నే తెలుగులో భ్రాంతి అని అంటాం. ఏవో మాటలు వినిపిస్తున్నట్లు, లేని వాసనలు వస్తున్నట్లు, లేని రుచి తెలుస్తున్నట్లుగా, లేని దృశ్యాలు కనిపిస్తున్నట్లుగా అనిపించడమే భ్రాంతి. స్కీజోఫ్రీనియా వ్యాధిగ్రస్తుల్లో ఈ భ్రాంతులు సాధారణం. వాళ్లలో చాలామందికి ఎవరెవరివో గొంతులు వినిపిస్తుంటాయి.

భ్రాంతులు ఎన్ని రకాలు.. ఎందుకు అలా జరుగుతాయి..?

 విజువల్ హేలూసినేషన్స్- లేనిది ఉనట్లు కనిపిస్తుంది. అంటే అక్కడ లేని వాటిని చూడటం. అవి వస్తువులు కావచ్చు..మనుషులూ కావచ్చు.
ట్యాక్టైల్ హేలూసినేషన్స్- ఇవి స్పర్శకు సంబంధించిన భ్రాంతులు. ఈ భ్రాంతులు శరీరాన్ని నిమురుతున్నట్లు, తాకుతున్నట్లుగా అనిపించేలా చేస్తాయి. కొన్ని సందర్భాల్లో శరీరమంతా పురుగులు పాకుతున్నట్లుగా అనిపిస్తుంటాయి. ఇది ఎక్కువగా నిద్రలో జరుగుతుంది.
డిటరీ హేలూసినేషన్స్: ఏవో శబ్దాలు వినిపిస్తున్నట్లుగా అనిపించడాన్ని ఆడిటరీ హేలూసినేషన్స్ అంటారు. ఎవరెవరివో గొంతులు వినిపిస్తాయి. ఈ శబ్దాలు అంతకుముందు విన్నవే కావచ్చు లేదా ఎప్పుడూ వినని కొత్త శబ్దాలు, గొంతులు కావచ్చు
గస్టేటరీ హేలూసినేషన్స్- ఇవి రుచులకు సంబంధించిన భ్రాంతులు. ఎలాంటి రుచీ లేకుండానే తీసుకునే ఆహారం ఒక్కోసారి వెగటైన రుచితో ఉన్న భ్రాంతి కలుగుతుంది. కొన్నిరకాల మూర్ఛవ్యాధుల్లో ఈ భ్రాంతి ఎక్కువగా ఉంటుంది.
జనరల్ సొమాటిక్ సెన్సేషన్స్- ఈ తరహా భ్రాంతుల్లోని అనుభవం వ్యక్తిగతంగా ఉంటుంది. అంటే చేయి మెలిపెడుతున్నట్లుగా, ఖండిస్తున్నట్లుగా అనిపించే అనుభవాలివి. ఇక కొందరు తమ పొట్టపై పాము కూర్చొని, పాకుతున్నట్లుగా ఉందని అనుకుంటారు.
మీకు అనిపిస్తుంది నిజం కాదని మీరు అనుమానించినట్లయితే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఇలా భ్రాంతులకు లోనయ్యేవారికి వారి డిజార్డర్‌ను బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. మానసికి స్థితి మెరుగ్గా లేనప్పుడే ఇలా ఎక్కువగా జరుగుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news