పిల్లలకోసం కుక్కలను పెంచాలనుకుంటున్నారా.. అయితే ఈ జాతి శునకాలు బెస్ట్‌..!

-

ఇంట్లో కుక్కలను పెంచడం ఈరోజుల్లో చాలామందికి అలవాటైంది. కొందరు అవసరం కోసం పెంచితే.. మరికొందరు పిల్లలు ఇష్టపడుతున్నారు అని పెంచుతున్నారు. అయితే మీరు కేవలం మీ పిల్లలు ఇష్టపడుతున్నారని కుక్కలను పెంచాలనుకుంటే.. కొన్ని స్పెషల్‌ బ్రీడ్స్‌ ఉన్నాయి. వాటిని పెంచితే..అవి స్నేహంగా ఉంటాయి. బాగా ఎంజాయ్‌ చేయొచ్చు. పిల్లలకు కుక్కలకు మధ్య మంచి బాండ్‌ కూడా ఏర్పడుతుంది. ఇంతకీ ఆ బ్రీడ్స్‌ ఏవంటే..

పగ్

కుక్కలలో ఇవి చాలా క్యూట్‌గా ఉంటాయి. ఇంకా తెలివైనవి కూడా. ఉత్సాహంగా ఉంటాయి. వీటి సైజు కూడా చాలా చిన్నగా ఉంటుంది. మెరిసే కళ్లతో, ముఖంపై ముడతలతో ఉండే ఇవి యజమానులను బాగా ప్రేమిస్తాయి. ఎక్కువగా మొరగవు.. కాబట్టి చిన్న పిల్లలు నిద్రపోయిన సమయంలో కూడా పెద్దగా డిస్ట్రబ్ చేయవు. ఇవి గారాబం చేయాలని కోరుకుంటాయి. పిల్లలతో బాగా ఆడుకుంటాయి.

పొమేరియన్

పోమెరేనియన్ కుక్కలు చాలా బబ్లీగా ఉంటాయి. అందంగా కనిపిస్తాయి. పిల్లలతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకుంటాయి. వీటికి శిక్షణ ఇవ్వడం కూడా చాలా సులువు. ఆప్యాయతను పంచుతుంది. ఒక్కసారి మీరు ఈ కుక్కలకి అలవాటు పడితే వేరే జాతుల జోలికి అసలు వెళ్లరు.

లాబ్రాడార్

అమెరికాలో అత్యంత ప్రసిద్ధి చెందిన శునకాల జాతి లాబ్రడార్ కూడా ఒకటి. వీటికి ఓపిక ఎక్కువ. వేటలో, ప్రేమను చూపించడంతో, చెప్పిన మాట వినడంలో ఇవి ముందుంటాయి. ఇవి చాలా చురుకుగా ఉంటాయి. చెప్పిన విషయాన్ని వెంటనే గ్రహిస్తాయి.

గోల్డెన్ రిట్రీవర్

ఎక్కువ మంది ఈ జాతి కుక్కలనే పెంచుకుంటారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన శుకక జాతీ ఇది. అందుకే ఫిబ్రవరి 3న జాతీయ గోల్డెన్ రిట్రీవర్స్ డే గా నిర్వహించుకుంటారు. పిల్లలకు ఇది మంచి ఫ్రెండ్ అవుతుంది. సహనం, ఉల్లాసం, ప్రేమించే గుణం… ఇవన్నీ గోల్డెన్ రిట్రీవర్‌కు ఎక్కువగా ఉంటాయి.. పిల్లలకు కాపల కాయడంలో, రక్షణగా నిలవడంతో వీటికి సాటి లేదు.

బీగిల్

ఈ కుక్కలు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాయి. వీటిని ఫ్యామిలీ డాగ్స్ అని పిలుచుకోవచ్చు. మనిషి కుటుంబంలో ఇట్టే కలిసిపోతుంది. ఇది శక్తిమంతంగా కూడా ఉంటాయి. అవసరమైనప్పుడు పిల్లలకు రక్షణగా నిలుస్తాయి. ఆగకుండా ఆడుతూనే ఉంటాయి. పిల్లల్ని ఆడించడంలో ముందుంటాయి. ఇంకా ఇవి మంచి కాపలా కుక్కలు కూడా. దీనికి ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే యజమానులను హెచ్చరిస్తాయట.

ఇవి కూడా..

బీగల్స్ కాకర్ స్పానియల్ కోలీ, రిట్రీవర్, పూడ్లేస్, డాల్మేషియన్స్, జర్మన్ షెపర్డ్స్, సెయింట్ బెర్నార్డ్, కావలీర్ కింగ్ చార్లెస్ స్పానియల్, బార్డర్ కోలీ, న్యూఫౌండ్‌ల్యాండ్, హవానీస్, పాపిలాన్, బెర్నీస్ మౌంటైన్ డాగ్, షియోన్, బిచోన్ వంటి స్నేహపూర్వక కుక్క జాతులుగా చెప్పుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news