రాశులు బట్టి మనుషుల యొక్క ప్రవర్తన ఉంటుంది. కొంత మంది తో నిజంగా మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏ రాశి వాళ్ళు ఎలా ఉంటారు..?, ఏ రాశి వాళ్ళు ప్రవర్తన ఎలా ఉంటుంది..? ఎవరికి దూరంగా ఉంటే మంచిది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
మేష రాశి:
మేషరాశి వాళ్ళు ఓడిపోవడానికి అస్సలు ఇష్టపడరు. ఒకవేళ ఓడిపోతే వాళ్ళు జనానికి దూరంగా వెళ్లిపోవాలి అని అనుకుంటూ ఉంటారు.
వృషభ రాశి:
వీరి దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నప్పుడు వీరికి బాగా అవమానంగా ఉంటుంది ఎక్కువ విలాసవంతంగా వీళ్ళు ఉండాలి అని అనుకుంటూ ఉంటారు.
మిధున రాశి:
వీళ్ళు చాల తెలివిగా వుంటారు. అలానే పనులని కూడా పూర్తి చేసేసుకుంటారు. ఎక్కువ నవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
కర్కాటక రాశి:
ఏడవాలి అనుకున్నా సరే ఈ రాశి వాళ్ళు తెలియకుండా చిరునవ్వుతో దాచేస్తారు. అభినందించాలన్న లేదా ప్రేమించాలన్న ఇబ్బంది పడతారు.
సింహరాశి:
ఎప్పుడూ జనం మధ్యలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. వీళ్ళ యొక్క తప్పులు అందరూ గమనిస్తున్నారని అనుకుంటూ ఉంటారు.
కన్యారాశి:
ఎవరైనా విమర్శిస్తే చాలా సిగ్గు పడతారు. సమాజంలో ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడాలని అనుకుంటారు.
తులారాశి:
ఇతరులకంటే కూడా వాళ్ళని వాళ్ళు ఉన్నతంగా ఎదగడానికి చూసుకుంటారు. ఆ విషయంలో నమ్మకానికి భంగం కలిగితే చాలా ఇబ్బంది పడతారు.
వృశ్చిక రాశి:
ఎక్కువగా దీర్ఘకాలిక అంచనాలకు దూరంగా ఆలోచించే తత్వం ఉంటుంది మీ యొక్క స్వభావం బయటపడకుండా పనులు చక్కబెట్టేసుకుంటారు.
ధనస్సు రాశి:
కల్మషం లేని మనసు వీరిది. అందుకనే వీళ్ళు ఎక్కువ స్నేహం చేయడానికి ఇష్టపడతారు. అయితే వాళ్లతో కొన్ని సందర్భాల్లో దూరంగా ఉండటం చాలా ముఖ్యం. వీళ్ళ మాటలు బాణాలై తగులుతాయి.
మకర రాశి:
వీళ్లకు విశ్వాసం ఎక్కువగా ఉంటుంది అలానే పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
కుంభరాశి:
చాలా చక్కగా ఈ రాశి వాళ్ళు మాట్లాడతారు. కానీ కొన్ని సార్లు మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది.
మీనరాశి:
వీళ్ళకి కళా సాహిత్యం పై మక్కువ. ఎక్కువ వంశ గౌరవం మంచితనం చాలావరకు వీరిని ఆదుకుంటుంది.