బిగ్ బాస్ ఫెమ్ అరియనాకు అరుదైన వ్యాధి.. పోస్ట్ వైరల్..

-

బిగ్ బాస్: బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అరియనా గ్లోరీ గురించి అందరికి తెలుసు.. యూట్యూబ్ ఛానెల్స్ లో ఇంటర్వ్యూ లు చేస్తూ ఫెమస్ అయ్యింది..ఆర్జీవీతో చేసిన ఒక్క బోల్డ్ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఫెమస్ అయ్యింది.. దాంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది.. అక్కడ తన యాట్టిట్యూడ్ తో అందరిని ఆకట్టుకుంది.. ఇక సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో దర్శనమిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా అందరికి షాకిచ్చింది.. తీవ్రమైన అనారోగ్యంతో భాధపడుతున్నట్లు ఓ ఫోటోను షేర్ చేసింది.. అది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..

చాలా రోజులుగా బాధపడుతున్నాను. ఎప్పుడు రికవర్ అవుతానేమో అని అరియనా వేదన వ్యక్తం చేశారు. అరియనా వీడియో చూసి ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు..అరియనా చేతికి సిరంజి కూడా ఉంది. ఆమెకున్న అనారోగ్య సమస్య ఏంటనేది తెలియదు. అరియనాకు బిగ్ బాస్ షో పాపులారిటీ తెచ్చింది. అరియనా ముక్కుసూటితనం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్త్వం ఆమెను ఇష్టపడేలా చేశాయి. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనా 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఓ దశలో ఆమె టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యారు. ఫైనల్ లో అనూహ్యంగా వెనుకబడ్డారు..

బిగ్ బాస్ తర్వాత ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. కెరీర్ లో సెట్ అయ్యింది. ఇక లైఫ్ ఇచ్చిన వర్మ కోసం అరియనా ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. జిమ్ ఫిట్ లో వ్యాయామం చేస్తూ వర్మ అడిగే పచ్చి బూతు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అరియనా ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ ఆ ఇంటర్వ్యూలో వర్మ రచ్చ చేశారు..ఇటీవల అరియనా బీబీ జోడిలో కంటెస్ట్ చేశారు. మాజీ బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ జోడీలు ఏర్పడి చేసిన ఈ షో సక్సెస్ అయ్యింది. అరియనా-అవినాష్ జోడి ఫైనల్ కి వెళ్లడం విశేషం. అనూహ్యంగా అరియనా జోడి ఫైమా-సూర్య జోడీ చేతిలో ఓడిపోయారు. విన్నర్స్ గా ఫైమా-సూర్య రూ. 25 లక్షలు కైవసం చేసుకున్నారు.. గతంలో అరియనా మ్యారేజ్ పై తన అభిప్రాయం చెప్పారు. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుని సెటిలైపోతాను. భార్యగా మారి పిల్లల్ని కని వారి ఆలనా పాలనా చూసుకోవడం, భర్తకు సేవలు చేయడం ఇష్టమని చెప్పారు.. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news