పసిఫిక్ మహాసముద్రంలో అడుగున ఇటుకల రహదారి.. ఎలా..?

-

అత్యంత లోతైన సముద్రాలలో పసిఫిక్ మహా సముద్రం కూడా ఒకటి. పదుల కిలోమీటర్లు లోతు ఉన్న మహాసముద్రాల్లో ఎన్నో అంతుచిక్కని, ప్రపంచం కన్నెరగని నిజాలు చాలానే ఉన్నాయి. ఎన్నో రహస్యాలాను సముద్రం తనలోనే దాచుకుంటుంది. వీటిని చేధించేందుకు సైంటిస్టులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు..ఈ క్రమంలోనే పసిఫిక్ మహాసముద్రంలో పసుపు ఇటుకలతో కూడిన రహదారిని పరిశోధకులు గుర్తించారు..

పసిఫిక్ మహాసముద్రంలోని పాపహనామోకుకేయా మెరైన్ నేషన్ మాన్యుమెంట్(PMNM)లోని లిలియుకలాని శిఖరాన్ని సర్వే చేస్తున్నప్పుడు పరిశోధకులు ‘పసుపు ఇటుకల రహదారి’ని గుర్తించారు.. పౌరాణిక నగరమైన అట్లాంటిస్‌కు రహదారిగా అభిప్రాయపడ్డారు ఓ పరిశోధకుడు. మరొకరు దీన్ని ది విజార్డ్ ఆఫ్ ఓజ్ చిత్రం ద్వారా ప్రాచుర్యం పొందిన పసుపు ఇసుక రహదారితో పోల్చారు. మనుషులు తయారు చేసినట్లుగా కనిపించే నిర్మాణాన్ని కనిపెట్టడం పరిశోధకులకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.

అసలు ఆ రహదారి ఎలా ఏర్పడింది.?

మహాసముద్రం అడుగు బాగాన ఇటుకల రహదారి ఏర్పడటానికి ఓ కారణం ఉందంటున్నారు పరిశోధకులు. ఈ అద్భుతమైన, ప్రత్యేకమైన, భౌగోళిక నిర్మాణం పురాతన అగ్నిపర్వత శిలలు ఏకరీతిలో విచ్ఛిన్నం అవడంతో ఇది ఏర్పడిందని పరిశోధకులు అంటున్నారు. ఎండిన సరస్సు మంచం వలెం కనిపించే నిర్మాణం వాస్తవానికి హైలోక్లాస్టైట్, అధిక శక్తి విస్పోటనాలతో ఏర్పడిన అగ్నిపర్వత శిల అని చెప్పారు శాస్త్రవేత్తలు. సముద్ర గర్భంలో అనేక రాతి శకలాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మరిన్ని అగ్నిపర్వత విస్పోటనాలు ఏర్పడటంతో కాలక్రమేణా పదేపదే శిలలు వేడెక్కడం, ఒక క్రమ పద్ధతిలో విచ్ఛిన్నం అవడం కారణంగా ఇవి ఏర్పడినట్లు తెలిపారు. ఇలాంటి రహస్యాలు.. సముద్రంలో చాలానే ఉన్నాయి. సైంటిస్టులు వీటిని కనుగొనేందుకు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు..

Read more RELATED
Recommended to you

Latest news