కొత్తగా నిర్మించిన రోడ్లు.. శంకుస్థాపన రోజు.. కొబ్బరికాయ కొట్టడంతోనే పగలింది. అప్పట్లో ఈ వార్త తెగ వైరల్ అయింది. అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనకు ఫన్నీగా అనిపిస్తుంది కానీ.. ఎఫెక్టెడ్ పర్సన్స్‌కు బాధ మాములుగా ఉండదు. తాజాగా ఇలాంటిదే ఒక ఘటన జరిగింది. నదిపై బ్రిడ్జి కట్టారు. ప్రారంభోత్సవం రోజు.. ముఖ్య అతిథి కూడా వచ్చారు. ఆయన వెనక పొలోమని జనాలంతా లైన్ కట్టారు. అంతే.. బ్రిడ్జి తెగింది. అందరు పది అడుగుల లోతులో పడ్డారు. ఇదంతా కెమెరాలో రికార్డు అవుతూనే ఉంది. మరి రికార్డైన విజువల్ ఊరికే ఉంచుతారా.. సోషల్ మీడియాలో పెట్టి హడావిడీ చేసేస్తారుగా.. అలానే ఈ క్రేజీ ఇన్సిడెంట్ వైరల్‌గా మారింది.!
నదిపై కట్టిన కొత్త బ్రిడ్జిపై నడవాలని వారంతా తెగ సంబరపడ్డారు. ప్రారంభానికి ముఖ్య అతిథి కూడా వచ్చారు. అతని వెనుక పర్యాటకులంతా నడవాలని ఆరటంగా చూస్తున్నారు. వంతెనను అలా ప్రారంభించి కొద్దిదూరం నడిచారుు.అంతే.. ఒక్కసారిగా వంతెన తెగిపడింది. అందరూ పడిపోయారు. ఈ ఘటన మెక్సికో నగరంలో చోటుచేసుకుంది.
మెక్సికోలో చెక్క బోర్డులు, మెటల్ గొలుసులతో వేలాడే వంతెనను ఇటీవల తిరిగి నిర్మించారు. దీని ప్రారంభోత్సవానికి నగర్ మేయర్ ఆయన భార్యతో కలిసి వచ్చారు. వంతెనను ప్రారంభించి కొద్దిదూరం అలా నడిచారు. వీరిద్దరితో పాటు మరికొంత మంది కూడా వెనక అడుగులు వేశారు. అధిక బరువు కారణంగా వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది అంతే… దీంతో వంతెన మీద ఉన్న సుమారు 20 మంది 10 అడుగుల లోతులో పడిపోయారు. ప్రమాదంలో 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో నలుగురు సిటీ కౌన్సిల్ మెంబర్లు కూడా ఉన్నారు. వీరందరినీ సమీప ఆస్పత్రికి తరలించారు. మేయర్, అతని భార్యకు స్వల్ప గాయాలయ్యాయి.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరు చూడండి.! ఈ వీడియోలో ఒక అతను అయితే..బ్రిడ్జికు వేలాడుతూ ఉంటాడు.
Footbridge collapse during reopening ceremony in Mexico pic.twitter.com/Kn4X554Ydk
— Adrian Slabbert (@adrian_slabbert) June 9, 2022