వార్నీ..ఈ పిల్లి తెలివి ముందు మేధావులు పనికిరారేమో..

-

ఉదయం లేచినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి.. అందులో జంతువులకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని మాత్రం జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.. కోతులకు సంబందించిన వీడియోలు బాగా ఫన్నీగా ఉన్నాయి. ఇప్పుడు పెంపుడు కుక్కలు, పిల్లుల వీడియోలు అనేకం ప్రతినిత్యం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తుంటాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిల్లి వీడియో ఒకటి నెటిజన్లు షాక్‌ అయ్యేలా చేస్తుంది. మేడ్ యు స్మైల్ ట్విట్టర్ పేజీ ద్వారా ఈ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయబడింది. ఆ వీడియో లో ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ పనులు చేస్తూ కనిపించాడు. ఆ వీడియోలో అతని పక్కనే ఉన్న ఫ్రిజ్ పైన పిల్లి కూడా కూర్చుని ఉంది. ఎలక్ట్రీషియన్ వైర్లను పైకి లేపినప్పుడు, పిల్లి దాని తల పైకెత్తి వాటిని చూడటానికి, పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. అందులో ఏముందా అని కాస్త దీర్ఘంగా చూస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ మారింది.

అయితే వైరల్‌ అవుతున్న ఈ వీడియోను  ఇప్పటి వరకు 56 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. చాలా మంది వీడియో కింద కామెంట్స్ కూడా రకరకాల పోస్ట్ చేశారు. పిల్లి చేష్టలు చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు. అదే సమయంలో కొందరు నెటిజన్లు విపరీతంగా కామెంట్‌ చేశారు. ఇది ప్రమాదం అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్‌ చేశారు.. మరి కొంత మంది స్మార్ట్ పిల్లి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఆ వీడియో నిజంగానే సూపర్ గా ఉంది. మీరు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news