ఇది విన్నారా?.. అతడికి 20 ఏళ్లుగా పీరియడ్సట..డాక్టర్లు ఏం చేశారంటే?

-

పీరియడ్స్ అనేవి ఆడ వాళ్ళకు వస్తాయని తెలుసు..వాళ్ళకి గర్భసంచి ఉంది కాబట్టి..పీరియడ్స్ కూడా వాళ్ళకే వస్తాయి.కానీ..ఎప్పుడైనా మగవారికి పీరియడ్స్ రావడం అనే మాట విన్నారా.. ఇప్పుడు ఓ వ్యక్తి ప్రతి నెల పీరియడ్స్ తో భాధ పడుతున్నాడు.. అతను చెప్పిన విషయాన్ని విని వైద్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు.ఈ వింత ఘటన చైనాలో వెలుగు చూసింది.20ఏళ్లుగా ఓ పురుషుడికి రుతుక్రమం అవుతోంది. మూత్రంలో రక్తం, తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వైద్యుడి వద్దకు వెళ్లిన ఆ వ్యక్తికి షాకింగ్ విషయం తెలిసింది.

అతడికి గర్భాశయం ఉన్నట్లు వైద్యులు తేల్చారు. అండాలు విడుదలవుతున్నట్లు గుర్తించారు. జీవశాస్త్ర పరంగా అతడు మహిళ అని నిర్ధారించారు..20 ఏళ్లుగా మూత్రంలో రక్తం వస్తున్నది. ప్రస్తుతం అతడి వయస్సు 33 ఏళ్లు. యుక్తవయస్సులో ఉన్నప్పుడు మూత్రవిసర్జన సమస్య ఉండడంతో ఆపరేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి అతడికి మూత్రంలో రక్తంతోపాటు సాధారణ పొత్తికడుపు నొప్పి వస్తున్నది. ఇటీవల కడుపునొప్పి నాలుగు గంటలకుపైగా కొనసాగడంతో డాక్టర్‌ను సంప్రదించాడు. డాక్టర్ అతడికి అపెండిసైటిస్ అని నిర్ధారించారు. ఆపరేషన్ చేశారు. అయినా, కడుపునొప్పి తగ్గలేదు.

మళ్ళీ వైద్యుల దగ్గరకు వెళ్ళాడు.స్కానింగ్ తీయగా, షాకింగ్ విషయం బయటపడింది. అతడికి గర్భాశయం, అండాశయాలతో సహా స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్నాయని తేలింది. అలాగే, మగ సెక్స్‌హార్మోన్లు ఆండ్రోజెన్ స్థాయిలు సగటు కంటే తక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఆడ సెక్స్‌హార్మోన్లు, అండాశయ కార్యకలాపాల స్థాయిలు ఆరోగ్యకరమైన వయోజన మహిళల్లో ఎలా ఉంటాయో అలాగే ఉన్నట్లు కనుగొన్నారు. లీ మగ, ఆడ పునరుత్పత్తి అవయవాలతో ఇంటర్‌సెక్స్‌లో జన్మించారని వైద్యులు చివరికి నిర్ధారణకు వచ్చారు..ఆ విషయం విన్న అతను షాక్ అయ్యాడు.. వెంటనే వాటిని తీసివెయ్యాలని కోరాడు.. వైద్యులు ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు..మొత్తానికి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది..

Read more RELATED
Recommended to you

Latest news