కరోనా ఒక జంట పెళ్లిని ఆన్ లైన్లో చేసింది..!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా ఉంది. దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఈ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. దీనితో అన్ని దేశాలు కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రజలు కరోనా దెబ్బకు భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. చాలా మంది బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. తాజాగా కరోనా దెబ్బకు ఆన్ లైన్ లో పెళ్లి చేసుకున్నారు.

ఇప్పటికే కరోనా ప్రభావం తో చాలా మంది పెళ్ళిళ్ళు వాయిదా వేసుకుంటున్నారు. తెలంగాణాలో ఒక పెళ్లిని కాస్త వింతగా చేసుకుంటున్నారు. రెండు నెలల క్రితం ఒక నిశ్చితార్ధం ఆన్లైన్ లో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లి ని అలాగే చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలకేంద్రానికి చెందిన ఒక ముస్లిం యువతీ… సౌదీలో ఉంటున్న ఖమ్మం యువకుడితో ఆమెకు ఈనెల 15న పెళ్లి చేసుకోవాల్సి ఉంది.

కరోనా కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో వరుడు భారత్‌కు రాలేదు. దీంతో ఎం చెయ్యాలా అని ఆలోచించిన కుటుంబ పెద్దలు, మత పెద్దలు ఆన్‌లైన్‌లోనే వరుడి అంగీకారాన్ని తీసుకొని పెళ్లి ఘట్టాన్ని ఇక్కడ పూర్తి చేసారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. కాగా భారత్ లో కరోనా కేసులు రోజు రోజు కి పెరుగుతున్నాయి. సోమవారం కరోనా కేసులు సెంచరీ దాటాయి.

Read more RELATED
Recommended to you

Latest news