పెళ్ళికి సరైన వయస్సు ఏది..? ఎప్పుడు పెళ్లి చేసుకుంటే బెస్ట్..?

-

పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన వేడుక. అయితే గతంలో త్వరగా పెళ్ళిళ్ళు చేసేవారు. కానీ ఇప్పుడు అబ్బాయికి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చి స్థిరపడ్డాక అప్పుడు పెళ్లిళ్లు చేస్తున్నారు. అలాగే అమ్మాయిలు కూడా ఎక్కువ చదువుకోవడం, ఉద్యోగం చేస్తుండడంతోపెళ్లిని ఆలస్యంగా చేసుకుంటున్నారు.

అబ్బాయిలు 30 దాటే వరకు కూడా పెళ్లి చేసుకోవడం లేదు. అమ్మాయిలు అయితే 26 ఏళ్లు తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు. అయితే మరి అందరూ ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు కదా..? నిజానికి అసలు పెళ్లి ఏ వయసులో చేసుకుంటే మంచిది అనే దాని గురించి చూద్దాం.

ఇప్పుడు చెబుతున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే సాధారణంగా ఒక అబ్బాయి 22 నుండి 26 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం మంచిది. ఈ వయసులో ఉన్నప్పుడు శుక్రకణాలు ఉత్పత్తి అధికంగా ఉంటుంది. దీనితో వారికి సంతాన సమస్యలు రావు. అలానే శృంగార జీవితాన్ని కూడా అనుభవించడానికి అవుతుంది.

ఇక అమ్మాయిల విషయంలోకి వస్తే అమ్మాయిలకి 18 నుండి 22 సంవత్సరాల లోపు పెళ్లి చేయడం మంచిది. గర్భాశయం కూడా ఎంతో వృద్ధి చెంది అండాలు ఉత్పత్తికి సిద్ధంగా ఉంటుంది దీంతో సంతానం కూడా త్వరగా కలుగుతుంది.

అదే ఒకవేళ అమ్మాయిలు 26 తర్వాత అబ్బాయిలు 30 సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఒక శృంగారపరమైన కోరికలు తగ్గుతాయి అలానే సంతానం లో సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వయసులో పెళ్లి చేసుకోవడం మంచిది. అంతేకానీ ఆలస్యంగా చేసుకోవడం వల్ల సమస్యలను ఎదుర్కోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news