కొవిడ్‌తోనే ఆగం ఐతున్నాం అంటే.. ఒకే వ్యక్తికి కొవిడ్, మంకీపాక్స్ బోనస్‌గా హెచ్ఐవీ మొత్తం మూడు వచ్చాయి.. వైద్య చరిత్రలోనే ఇది ఒక సంచలనం అని నిపుణులు అంటున్నారు. ఇటలీకి చెందిన ఓ వ్యక్తికి కొవిడ్ – 19, మంకీపాక్స్, హెచ్ఐవి -1 కి ఒకేసారి పరీక్షలు చేయగా.. అన్నింట్లోనూ పాజిటివ్ వచ్చాయని.. ఇలా అన్ని పాజిటివ్ వచ్చిన మొదటి కేసు ఇదేనని శాస్త్రవేత్తలు తెలిపారు.. ఇన్ని వచ్చాయంటే.. మనోడు ఏం చేసి ఉంటాడు..? అసలు విషయం తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు.!
ఇటలీకి చెందిన వ్యక్తి.. ఈ సంవత్సరం జూన్‌లో స్పెయిన్ పర్యటనకు వెళ్లాడు. టూర్‌కి వెళ్లిన అతను జూన్ 16 నుంచి 20 వరకు స్పెయిన్‌లో ఐదు రోజులు ఉన్నాడు. ఆ సమయంలో అసురక్షిత లైంగిక సంబంధంలో పాల్గొన్నాడు. కట్ చేస్తే.. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తొమ్మిది రోజుల తర్వాత అలసట, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు..జూలై 2న ఆ వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదే రోజు మధ్యాహ్నం అతని ఎడమ చేతిపై దద్దుర్లు రావడం ప్రారంభమయ్యాయి… మరుసటి రోజు అతని మొండెం, దిగువ అవయవాలు, ముఖం, గ్లూట్స్పై దద్దుర్లు వచ్చాయని జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్లో ప్రచురించిన కేస్ స్టడీ నివేదికలో పేర్కొన్నారు..
జూలై 5 నాటికి వెసికిల్స్ మరింత వ్యాప్తి చెంది… చర్మంపై చిన్న గడ్డలుగా మారాయట.. ఆ సమయంలో వ్యక్తిని ఇటలీలోని కాటానియాలోని శాన్ మార్కో యూనివర్శిటీ హాస్పిటల్‌లోని అత్యవసర విభాగానికి తరలించారు. అనంతరం ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగానికి బదిలీ చేశారు. మంకీపాక్స్ కూడా సోకిందని తేలింది. రోగికి బహుళ STI పరీక్షలు నిర్వహించగా.. అతను HIV-1 పాజిటివ్ అని వెల్లడైంది..
అతని CD4 గణనను బట్టి.. సంక్రమణ సాపేక్షంగా ఇటీవలిదేనని తేలినట్లు వైద్యులు తెలిపారు. కొవిడ్ -19, మంకీపాక్స్ కోలుకున్న తరువాత.. రోగిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారు. మొత్తానికి విహార యాత్ర కాస్త ఓదార్పు యాత్రగా మిగిలిపోయింది.!