ఔషధ మొక్కల పెంపకం.. తక్కువ ఖర్చు.. ఎక్కువ ఆదాయం..!

-

న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో సహజ ఉత్పత్తులకు భారీ డిమాండ్ పెరిగింది. తీవ్రమైన వ్యాధులను నివారించేందుకు మసాల దినుసులను, ఔషధ మొక్కల మార్కెటింగ్ వేగంగా విస్తరించింది. చాలా మంది భారతీయులు ఇంటి చిట్కాలను ఉపయోగించి వైరస్ బారిన పడకుండా రోగ నిరోధకశక్తిని పెంచుకున్నారు. మార్కెట్‌లో ఔషధ మొక్కలతో తయారైన ఉత్పత్తులకు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉంది. తక్కువ ఖర్చుతో పండించడంతోపాటు అధిక లాభాన్ని అర్జిస్తాం. దీంతోపాటు పంట దిగుబడి కూడా ఎక్కువ రోజుల వరకు ఉంటుందని ఉద్యానవన అధికారులు సూచిస్తున్నారు. ఔషధ మొక్కల పెంపకం అనేది పొడవైన వ్యవసాయం. ఈ వ్యవసాయం కోసం రైతులు పొలాలను దున్ని అధిక ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఔషధ మొక్కలను పండించాలనుకునే వారికి కొన్ని కంపెనీలు చేయూతను ఇస్తాయి. వాటితో ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే ఆ కంపెనీలే పంటకు కావాల్సిన అన్ని ఉత్పత్తులను సమకూరుస్తాయి. మొదట్లో రైతులు రూ.వేలల్లో మాత్రమే పెట్టుబడి పెట్టుకుంటే సరిపోతుంది. పంట అమ్మకానికి వచ్చాక రూ.లక్షల్లో సంపాదించుకోవచ్చు.

ఔషధ మొక్కల పెంపకం
ఔషధ మొక్కల పెంపకం

చిన్నకుండల్లోనే సాగు..
తులసి, ఆర్టెమిసియా అన్నూవా, ములాతి, కలబంద వంటి చాలా మూలికా మొక్కల పంటలు చాలా తక్కువ సమయంలోనే చేతికి వస్తాయి. అయితే వీటికి ప్రత్యేకంగా వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం చిన్న చిన్న కుండల్లో విత్తనాలు వేసి సాగు చేస్తే సరిపోతుంది. వీటికోసం ప్రత్యేకంగా షెడ్డును ఏర్పాటు చేసుకుని అందులో చిన్న కుండీల కొనుగోలు చేసుకుంటే సరిపోతుంది. సహజసిద్ధమైన ఎరువులనే వాడాలి. ఇలాంటి పంట పండించాలని అనుకుంటే అనేక ఔషధ కంపెనీలు దేశంలో ఉన్నాయి. వాటితో ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే పంట దిగుబడిని బట్టి ఆదాయాన్ని నిర్ధారిస్తాయి.

రూ.3 లక్షల ఆదాయం..
హిందువులు తులసి మొక్కను పూజిస్తారు. తులసి ఆకులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజూ 3-5 తులసి ఆకులు తిన్నట్లయితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అందుకే తులసి మొక్కలకు డిమాండ్ ఎక్కువ. అయితే తులసి మొక్కలు అనేక రకాలు. వీటిలో యూజీనాల్, మిథైల్ సిన్నమేట్ వంటి రకానికి చెందిన పంటను ఎంచుకోవాలి. వీటితో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు మందులు తయారు చేస్తారు. ఒక హెక్టార్ భూమిలో తులసి పంటను పండిస్తే.. ఖర్చు రూ.15 వేలు అవుతుంది. కానీ మూడు నెలల తర్వాత రూ.3 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు.

ప్రస్తుతం దేశంలో పతంజలి, డాబర్, వైద్యనాథ్ వంటి ఆయుర్వేద మెడిసిన్స్ ఔషధ తయారీ సంస్థలు తులసి పంట పండించే వారితో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. పంట చేతిలోకి వచ్చాక వాళ్లే పంటను కొనుగోలు చేసుకుంటారు. తులసి విత్తనాలతో నూనె తయారు చేస్తారు. ప్రతిరోజూ నూనె, తులసి విత్తనాలకు ఆయా మార్కెట్ రేటును బట్టి విక్రయిస్తారు. అయితే, ఔషధ మొక్కల పెంపకంపై లక్నోలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్ (సీఐఎంఏపీ) సంస్థ శిక్షణ కూడా ఇస్తోంది. ఈ ఇన్‌స్టిట్యూట్ ఆయా ప్రాంతాల్లో క్యాంపెయినింగ్ నిర్వహిస్తూ పలు ఔషధ కంపెనీలతో రైతులకు ఒప్పందం కూడా కుదిరిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news