ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. ఆయన ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అనేది తెలియక పోయినా ఆయన రాజకీయ భవిష్యత్తుపై మాత్రం అనేక చర్చలు జరుగుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.
ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అప్పట్లో ఘాటుగా విమర్శలు చేశారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ లక్ష్యంగా ఆయన ఘాటుగా విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. 2019 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారగా ప్రభుత్వంపై కూడా ఆయన ఘాటుగా విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ దాదాపుగా సైలెంట్ గా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన తో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి మీకు ఎంపీ సీటు ఖరారు చేస్తామని వైసీపీ నేతలు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వైసీపీ నుంచి ఒక మంత్రి ఆయనతో మాట్లాడారని అలాగే రాజ్యసభ ఎంపీ కూడా ఆయనతో చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో త్వరలోనే ఆయన భేటీ అయ్యే అవకాశాలు ఉండవచ్చని సమాచారం. వైఎస్ కుటుంబంతో ముందు నుంచి కూడా కన్నా లక్ష్మీనారాయణకు దగ్గర సంబంధాలే ఉన్నాయి. మరి కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ లోకి వస్తారా లేదా చూడాలి.