మీ చిన్నారులు చురుకుగా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

-

చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ చిన్నారులు చురుకుగా ఉండాలని చూస్తూ ఉంటారు. మీ చిన్నారులు కనుక చురుకుగా ఉండాలంటే ఇలా చేయండి. దీనితో మీ పిల్లలు చురుకుగా ఉంటారు. ఇక మరి మనం పిల్లలని ఎలా చురుకుగా మార్చచ్చు అనేది చూసేద్దాం.

 

లైబ్రరీ కి తీసుకువెళ్లండి:

పిల్లలని లైబ్రరీకి తీసుకు వెళ్తూ ఉండండి. పిల్లలని లైబ్రరీకి తీసుకువెళ్లడం వలన వాళ్ళు చురుకుగా ఉంటారు. పైగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వాళ్ళ జ్ఞానాన్ని కూడా పెంచుకోవచ్చు.
తెలియని కొత్త విషయాలు పుస్తకాల ద్వారా పిల్లలకి తెలుస్తాయి.

పజిల్స్ ఇవ్వండి:

మెదడును చురుకుగా పజిల్స్ మారుస్తాయి బ్రెయిన్ పజిల్స్ ని పిల్లల చేత ఆడిస్తే వాళ్ళ జ్ఞాపకశక్తి పెరుగుతుంది వాళ్ళు చురుకుగా ఉంటారు.

మ్యూజియం కి తీసుకెళ్లండి:

పిల్లలని మ్యూజియం కి తీసుకెళ్లడం వలన కూడా వాళ్ళు కొత్త విషయాలని తెలుసుకోగలుగుతారు. అలానే చరిత్ర గురించి కూడా తెలుస్తుంది. ఎన్నో విషయాల మీద వాళ్ళకి అవగాహన కూడా వస్తుంది.

ప్రయోగాలు చేసేలా ప్రోత్సహించండి:

పిల్లల్ని సైన్స్ ప్రయోగాలు చేసే విధంగా మీరు ప్రోత్సహిస్తూ ఉండండి. అప్పుడు పిల్లలు చురుకుగా తయారవుతారు.

వివిధ భాషలని నేర్పండి:

పిల్లలని అలా వదిలేయకుండా మాతృభాషతో పాటుగా ఇతర భాషలను కూడా వాళ్ళకి నేర్పుతూ ఉండండి ఇలా చేయడం వలన వాళ్లకి కొత్త విషయాలు తెలియడమే కాకుండా ఇతర భాషల మీద పట్టు వస్తుంది అలానే జ్ఞానం కూడా పెరుగుతుంది. అలానే పిల్లలకి మీరు వాళ్ళ సమస్యల్ని వాళ్లు పరిష్కరించుకునే విధంగా మార్చండి. మంచి ఆహారం కూడా ఇవ్వండి. అన్ని రకాల ఆహార పదార్థాలని కనుక వాళ్ళు తింటే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఏ సమస్యా ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version