ఎమోషనల్ గా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

చాలా మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ కాలంలో చాలామంది ఎమోషనల్ గా ఇబ్బంది పడుతున్నారు. అయితే నిజానికి ఎలా అయితే ఫిజికల్ హెల్త్ ముఖ్యమో ఎమోషనల్ హెల్త్ కూడా అంతే ముఖ్యం. ఎమోషనల్ గా ఆరోగ్యంగా ఉండడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే చాలా మంది లైట్ తీసుకుంటూ ఉంటారు.

అలా చేయడం నిజంగా తప్పు. ఉద్యోగ సమస్యలు లేదు అంటే చదువు వల్లనో లేదు అంటే కుటుంబ వల్లనో ఏదో ఒక సమస్య కారణంగా మానసిక సమస్యలు వస్తాయి. అయితే ఒత్తిడి కలిగినప్పుడు ఏం చేయాలి..?, ఎమోషనల్ హెల్త్ ని ఎలా బాగా వుంచుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. మరి ఇక ఆలస్యం ఎందుకు దీనికోసం ఎప్పుడు పూర్తిగా చూసేయండి.

ఓటమిని అంగీకరించాలి:

అక్కడ జరిగిన ఫ్యాక్ట్ ని మీరు అంగీకరించాలి. మీరు కనుక తప్పు చేశారు అంటే తప్పకుండా దానిని ఒప్పుకోవాలి. అలా చేస్తే సగం ఇబ్బంది తొలగి పోయినట్లే.

నెగెటివ్ ఆలోచనల నుండి దూరంగా ఉండండి:

మీకు వచ్చే నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టేసి మంచిగా పాజిటివ్ గా ఆలోచిస్తే సమస్యల నుంచి బయట పడవచ్చు. లోపల నెగటివ్ ఆలోచనలు కలగడం వల్ల ఎంతో బాధగా ఉంటుంది. అలాగే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

మ్యూజిక్ మరియు మెడిటేషన్:

ప్రశాంతంగా ఉండటానికి మ్యూజిక్ మెడిటేషన్ హెల్ప్ అవుతుంది. మీరు కనుక ఒత్తిడికి గురైనా లేదంటే సమస్యలతో వున్నా మెడిటేషన్ లేదా మ్యూజిక్ అనుసరించడం మంచిది. దీనితో కూడా సమస్యల నుంచి బయట పడవచ్చు.

స్నేహితులతో మాట్లాడటం:

మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే మీకు బాగా దగ్గరగా ఉండే స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడండి. వాళ్ళతో కాసేపు సమయాన్ని వెచ్చించి మీయొక్క బాధను పంచుకుంటే కచ్చితంగా సమస్య నుంచి బయట పడవచ్చు.