ఇలా మీ బ్యాంక్ బ్యాలెన్స్ ని వాట్సాప్ లో చెక్ చేసుకోండి..!

-

ప్రతీ ఒక్కరు ఈ మధ్య కాలం లో వాట్సాప్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. రోజు రోజుకి కొత్త అప్డేట్స్ ని కూడా వాట్స్ ఆప్ తీసుకు వస్తోంది. అయితే యూజర్ల కోసం ఈ మెసేజింగ్ సర్వీసెస్ యాప్ పేమెంట్స్ ఫీచర్‌ను కూడా తీసుకు వచ్చింది. దీనితో డబ్బులను ఇతరులకు పంపవచ్చు. అయితే వాట్స్ అప్ బ్యాంకు నుంచి బ్యాంకుకు ట్రాన్సక్షన్స్ జరపాలంటే పేమెంట్స్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసిన యూపీఐను ఉపయోగిస్తోంది.

అలానే బ్యాంక్ ఖాతా ని గుర్తించడానికి మీ అకౌంట్‌తో లింకైన ఫోన్ నెంబర్‌ను వాడుతోంది. అయితే యూజర్లు బ్యాంక్ బ్యాలెన్స్ ని వాట్స్ ఆప్ ద్వారా తెలుసుకోవచ్చు అని అంది. వాట్సాప్ ద్వారా మీ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందో చూసుకొచ్చు.

బ్యాలెన్స్ ని రెండు విధాలుగా చూడచ్చు. ఒకటి సెట్టింగ్స్‌‌ ద్వారా బ్యాంకు బ్యాలెన్స్ తెలుసుకోవడం. రెండోది వేరే వాళ్లకి డబ్బు పంపుతూ చూడడం. ఇక ఎలా చెక్ చేసుకోవాలనేది చూస్తే..

ముందు మీరు వాట్సాప్ ఓపెన్ చేయాలి
ఇప్పుడు కుడివైపు పైనున్న ఆప్షన్లలోకి వెళ్ళండి ఆండ్రాయిడ్ ఫోన్ వాళ్ళు.
ఒకవేళ మీరు ఐఫోన్ వాడుతూ ఉంటే, సెట్టింగ్స్‌కి వెళ్లాలి.
ఇప్పుడు పేమెంట్లపై క్లిక్ చెయ్యండి.
ఆ తరవాత పేమెంట్స్ మెథడ్స్‌ కిందనున్న బ్యాంకు అకౌంట్‌ మీద క్లిక్ చెయ్యండి.
ఇక్కడ బ్యాంకు అకౌంట్లు కనిపిస్తాయి.
ఏ బ్యాంకు ఖాతా వివరాలు చూడాలని అనుకుంటున్నారో దాని మీద క్లిక్ చెయ్యండి.
ఇప్పుడు వ్యూ అకౌంట్ బ్యాలెన్స్‌ మీద క్లిక్ చెయ్యండి.
యూపీఐ పిన్‌ని నమోదు చేసి ఫైనల్ గా బ్యాలెన్స్ చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news