ఆల్కాహాల్ విషంగా ఎందుకు మారుతుంది ?..కల్తీమద్యం ఎలా తయారు చేస్తారో తెలుసా?

-

కల్తీమద్యం తాగి చనిపోయారు, కల్తీమద్యం తాయరుచేస్తూ పట్టుబడ్డారు అనే వార్తలను మనం వినం ఉంటాం. తాజాగా బీహార్ లో కూడా 41 మంది కల్తీమద్యం తాగి ప్రాణాలు కోల్పాయారు. ఇన్ని అనార్థాలు జరుగుతున్నా మద్యం నిషేదం ఉన్నా ఎవ్వరూ పట్టించుకోరు. చేసేవాళ్లు ఎలా అయినా చేస్తూనే ఉంటారు. తెలుగురాష్ట్రాల్లోనూ ఇదే వరుస. ఈరోజు మనం కల్తీమద్యం ఎలా తయారుచేస్తారు, అది ఎలా విషంగా మారుతుందో తెలుసుకుందాం.

ఏదైనా సరే కల్తీ అయింది అంటే..అందులో వాడకూడదని పదార్థాలే వాడారు అని అర్థం. అలానే మద్యం కల్తీలో చెరకూ లేదా ఖర్జూరం, చక్కెర, సాల్ట్‌పెట్రే, బార్లీ, మొక్కజొన్న, కుళ్ళిన ద్రాక్ష, బంగాళాదుంపలు, బియ్యం, చెడిపోయిన నారింజ మొదలైన వాటిని ముడిసరుకుగా ఉపయోగిస్తారు. వీటన్నిటిని కలిపి ఈస్ట్ ద్వారా పులియబెడుతారు. తర్వాత దీనికి ఆక్సిటాక్సిన్, నౌసాదర్, బెస్రాంబెల్ ఆకులు, యూరియా కూడా కలుపుతారు.

ఈ మద్యం తాగటం వల్ల పురుషుల్లో అంగస్తంభన సమస్యలు వస్తాయట. అంతేకాదు నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయట. వీటిని మట్టిలో పాతిపెట్టిన తర్వాత బట్టీ సాయంతో ఆవిరి నుంచి మద్యం తయారు చేస్తారు. దీనిని మరింత మత్తుగా మార్చేందుకు మిథనాల్ కూడా కలుపుతారు. ఇదీ చాలక నిర్వాహకులు ఇంకా మత్తు కావాలని రకరకాల రసాయనాలను కలుపుతున్నారు. ఈ క్రమంలో అది విషంగా మారుతుంది.

యూరియా, ఆక్సిటాక్సిన్, బెస్రాంబెల్ ఆకులు మొదలైన వాటిని కలిపి పులియబెట్టడం వల్ల అది ఆల్కహాల్ కాస్తా ఇథైల్ ఆల్కహాల్ కు బదులుగా మిథైల్ ఆల్కహాల్‌గా మారుతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఆల్కహాల్ విషపూరితం కావడానికి ఈ మిథైల్ ఆల్కహాలే కారణం. మిథైల్ ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లి ఫార్మాల్డిహైడ్ లేదా ఫార్మిక్ యాసిడ్ అనే విషంగా మారుతుందట..అది తాగేవారి మెదడుపై ప్రభావం చూపుతుంది.

మరణానికి ఎలా కారణమవుతుంది?

మిథైల్ ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే రసాయన ప్రతిచర్య వేగవంతం అవుతుంది. దీని వల్ల శరీరంలోని అంతర్గత అవయవాలు పనిచేయడం మానేస్తాయి. అయితే కొందరిలో ఈ ప్రక్రియ నిదానంగా ఉంటే మరికొందరిలో వేగంగా ఉంటుంది. దీని కారణంగా చాలా సందర్భాలలో అకాల మరణం సంభవిస్తుంది.

కల్తీమద్యం తాగి ఎన్నో కుటుంబాలు పెద్దదిక్కుని కోల్పోయి అనాథలుగా మారాయి. ఇప్పటికైనా కల్తీమద్యం తాగేవారు ఎన్ని సంఘటనలు జరిగినా వాళ్లలో మాత్రం ఎలాంటి మార్పురావటం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news