జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి ఎంత ఖ‌ర్చ‌యిందో తెలుసా..?

-

ఏపీ ఆర్థిక ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప‌లు పొదుపు నిర్ణ‌యాల‌ను అంత‌కు ముందుగానే తీసుకున్న జ‌గ‌న్ అతి త‌క్కువ ఖ‌ర్చుతో త‌న ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి అంద‌రిచే భేష్ అనిపించుకున్నారు.

ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తాను మాటల మ‌నిషిని కాద‌ని, చేత‌ల మ‌నిషిన‌ని నిరూపించుకున్నారు. సీఎంగా ప్ర‌మాణం చేయ‌క‌ముందే రాష్ట్రం ఉన్న ఆర్థిక స్థితిని గ‌మ‌నించిన జ‌గ‌న్ త‌క్కువ ఖ‌ర్చుతోనే ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అంత‌కు ముందు తాను చెప్పిన‌ట్లుగానే ఆ మాట‌ను జ‌గ‌న్ నిల‌బెట్టుకున్నారు. ఏపీ ఆర్థిక ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప‌లు పొదుపు నిర్ణ‌యాల‌ను అంత‌కు ముందుగానే తీసుకున్న జ‌గ‌న్ అతి త‌క్కువ ఖ‌ర్చుతో త‌న ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి అంద‌రిచే భేష్ అనిపించుకున్నారు.

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నిన్న సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో నిర్వ‌హించిన ఆ కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్ ఏపీ సీఎంగా ప్ర‌మాణం చేశారు. ఆ కార్య‌క్ర‌మానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణం చేశాక అదే వేదిక‌పై స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌లు కూడా చేశారు. అనంత‌రం తాను ఏపీ ప్ర‌జ‌ల‌కు ఏం చేయ‌ద‌ల‌చుకున్నారో చెప్పారు.

అయితే ఆ ప్ర‌మాణ స్వీకారానికి కేవ‌లం రూ.29 ల‌క్ష‌లు మాత్ర‌మే ఖ‌ర్చయింద‌ట‌. అవును, నిజ‌మే. ఈ మేర‌కు ఓ జీవోను కూడా ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. కాగా గ‌తంలో 2014లో చంద్రబాబు ఏపీ సీఎంగా ప్ర‌మాణం చేసేందుకు నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి ఏకంగా రూ.1.50 కోట్లు ఖ‌ర్చు పెట్టార‌ట‌. దీంతో ఇప్పుడిదే అంశంపై రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల్లోనూ జోరుగా చ‌ర్చ సాగుతోంది. ఏపీకి ప్ర‌స్తుతం రూ.2.5 ల‌క్ష‌ల కోట్ల అప్పులున్నాయి. ఇక ఖ‌జానాలో కూడా పెద్ద‌గా డ‌బ్బేమీ లేదు. అలాగే అటు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు కూడా స‌రిగ్గా ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో ఏపీ ఉంది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వ ఖ‌జానాపై భారం ప‌డ‌కూడ‌ద‌ని చెప్పి జ‌గ‌న్ చాలా త‌క్కువ ఖ‌ర్చుతోనే త‌న ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మాన్ని ముగించారు. మ‌రి ముందు ముందు రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగ‌వ్వ‌డానికి జ‌గ‌న్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version