మహిళలకు అస్సలు నచ్చని పనులలో పీరియడ్స్, బ్రా వేసుకోవడం ముందు ఉంటాయి. వీటిని మనం తప్పించలేం…బ్రా వేసుకోవడం అంటే చాలా లెక్కలు ఉంటాయి. మీ కప్ సైజ్‌కు తగిన బ్రా ధరించకపోతే చాలా సమస్యలు వస్తాయి. అలాగే సరైన బ్రా వేసుకుంటే.. వక్షోజాల ఆకృతి కూడా సెట్ అవుతుందట. ఆకృతిని మెరుగుపరచడంలో, కిందకు పడిపోకుండా ఫీట్‌గా కనిపించేలా బ్రా చేస్తుంది. కానీ బ్రా ధరించకపోతే కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
బ్రా ధరించకపోవడం వల్ల భుజం, మెడ నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. బ్రా ధరించడం మానేస్తే.. బిగుతుగా ఉన్న బ్రా కారణంగా బాధపడేవారిలో ఉపశమనం పొందవచ్చు. బ్రా ధరించడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ధరించకపోవడం వల్ల కచ్చితంగా ప్రయోజనాలు ఉన్నాయి.
మీరు బ్రా ధరించడం మానేస్తే.. మీ రొమ్ములు సహజంగా వాటి సహజ ఆకృతికి సర్దుబాటు అవుతాయట.. బ్రా సపోర్ట్ లేకుండా, ఛాతీ కండరాలు కదలడానికి, వాటి సహజ ఆకృతిని ఉంచడానికి అనుకూలంగా ఉంటాయి. దీంతో రొమ్ముల మీద ఒత్తిడి ఉండదు. ఛాతీ కండరాలకు ఫ్రీగా ఉంటుంది. నొప్పి నుంచి బయటపడొచ్చు. బ్రా ధరించడం సౌకర్యంగా ఉండవచ్చు. కానీ ఇది భుజాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. దీనితో మీ వక్షోజాల ఆకృతి మీద కూడా ప్రభావం ఉంటుంది. బ్రా ధరించి.. తీసే సమయంలో ఫ్రీగా ఫీలవుతారు. బ్రా ధరించనప్పుడు మీ చర్మం చికాకుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. చాలా వరకు బ్రాలు చర్మాన్ని చికాకుపరుస్తాయి..అసౌకర్యాన్ని కలిగిస్తాయి. బ్రా వేసుకోవడం మానేస్తే.. మీ చర్మం తక్కువ చికాకుగా అనిపిస్తుంది. తద్వారా మీరు మరింత సుఖంగా ఉంటారు.
బ్రా ధరించకపోవడం శ్వాస తీసుకోవడంలో సహాయపడుతుంది. బ్రా ధరించడం వల్ల ఛాతీ కండరాలు కుదింపు, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఆ కుదింపు లేకుండా హాయిగా శ్వాస తీసుకోవాలంటే.. బ్రా ధరించకపోవడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు. బ్రా ధరించకపోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మెరుగైన భంగిమ నుంచి తక్కువ చికాకు, మెరుగైన శ్వాస వరకు ఉపయోగపడుతుంది.
మహిళల్లో రొమ్ము నొప్పులు, భుజం నొప్పి, లేదా వెన్ను నొప్పులు కలగడానికి అసౌకర్యమైన బ్రా ధరించడం కూడా ఒక కారణం కావొచ్చు. చాలా బిగుతుగా ఉండే, పెద్ద సైజులో ఉండే లేదా సరిగ్గా సరిపోని పట్టీలు కలిగిన బ్రాని ధరిస్తే పలు భాగాల్లో నొప్పి కలగడమే కాకుండా రొమ్ముల్లో అసమానత, ఇతర శారీరక దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. సరైన సైజును ఎంచుకుంటే ఈ సమస్యకు కొంతమేర పరిష్కారం లభిస్తుంది.