కేసీఆర్ ప్రభుత్వం రైతులకు చేసిందేం లేదు – పొన్నాల లక్ష్మయ్య

-

సిద్దిపేట: చేర్యాల మండలంలో నిన్న కురిసిన వడగళ్ల వానకు నష్టపోయిన పంటలను పరిశీలించారు మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 50వేల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతులు కోటీశ్వరులు అయ్యారని గొప్పలు చెప్పుకుంటారని.. ప్రభుత్వానికి అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతుల గోసలు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.

హెలికాప్టర్లో తిరుగుతూ పంట నష్టం పై సర్వే చేసే ముఖ్యమంత్రికి క్షేత్ర స్థాయిలో రైతుల భాధలు ఏం తెలుస్థాయని మండిపడ్డారు పొన్నాల లక్ష్మయ్య. గత తొమ్మిదెళ్ళలో రైతు బంధు, రైతు భీమా పేరుతో ఓట్ల రాజకీయాలు చేయడం తప్ప కేసిఆర్ ప్రభుత్వం రైతులకు చేసిందేమి లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news