మనిషి మాంసం తినడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా?

-

ఆదివారం వస్తే చికెనా లేదా మటన్ తిందమా అని ఆలోచిస్తారు..అసలు మాంసం తినడం ఎప్పటి నుంచి వెలుగులోకి వచ్చిందో చాలా మందికి తెలియక పోవచ్చు.. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
2.5 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి దారుణంగా వేడెక్కింది. వాతావరణ మార్పుల కారణంగా…అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది. పచ్చదనం కనిపించకుండా పోయింది. ఉన్నట్టుండి భూమి ఎడారిగా మారిపోయింది. అప్పటి వరకూ దొరికిన పండ్లు, ఆకులతో కడుపు నింపుకున్న ఆది మానవులకు ఆకలి అనేది తెలిసొచ్చింది. ఆ ఆకలే కొత్త ఆలోచనకు బీజం వేసింది.

మనుగడ సాగించేందుకు కొత్త శక్తి అవసరమని భావించారు వారంతా. గుంపులుగా ఉండటం అప్పుడే నేర్చుకున్న వాళ్లు…ఆహారం కోసం వేటాడటం మొదలు పెట్టారు. జీబ్రాలు, హైనాలు లాంటి జంతువులను వేటాడి వాటి మాంసాన్ని తినేవారు.అప్పటి నుంచి మాంసం తినడం అలవాటు అయ్యింది.మన మెదడు సైజ్ చాలా పెద్దది. ఈ మెదడు సరిగ్గా పని చేసేందుకు టన్నుల కొద్ది శక్తి అవసరం. మన శరీరంలోని శక్తిలో దాదాపు 20% మేర కేవలం మెదడు పని చేయడానికే పోతుంది.

అయితే,ఆ శక్తి కోసమే ఆది మానవులు మాంసం తినటం మొదలు పెట్టారన్న వాదనా ఉంది. మెదడు చురుగ్గా పని చేసేందుకు, అప్పట్లో మాంసమే కీలక పాత్ర పోషించిందనీ అంటారు. కొందరు సైంటిస్ట్‌లు అయితే…మనల్ని ఆధునిక మానవుడిగా నిలబెట్టింది మాంసమే అని చెబుతున్నారు.మానవ పరిణామ క్రమంలో పొట్ట పరిమాణం పెరిగింది. జీర్ణశక్తిలోనూ మార్పులు వచ్చాయి. శక్తి కోసం ఎక్కువ ఆహారం తీసుకోవాల్సి వచ్చేది. ఇందుకోసం జీర్ణశక్తి ఎక్కువగా ఖర్చయ్యేది. మాంసంలో అనేది హై ప్రోటీన్ ఉన్న ఫుడ్. ఆకలి తీర్చుకునేందుకు ఎక్కువ మొత్తంలో రోజూ మాంసాన్ని తినేవారు..

నిప్పు పుట్టిన తర్వాత నుంచి మాంసాన్ని కాల్చి తినేవాళ్ళు..మాంసం తినటం హ్యూమన్‌ లైఫ్‌లో ఇప్పుడు చాలా కామన్‌గా మారిపోయింది. అప్పుడంటే… ఆదిమానవులు మాంసం అవసరం కాబట్టి తిన్నారు. ఇప్పుడు మనం ఇష్టం కొద్ది తింటున్నాం. అంతే తేడా. ఎంత కాదనుకున్నా..మన మూలాలు మనలోనే ఉంటాయి కదా. అందుకే మనిషికి మాంసం అంటే అంత ఇష్టం..అలా మాంసం అనేది వచ్చింది..

Read more RELATED
Recommended to you

Latest news