లిఫ్ట్స్ వచ్చాకా మెట్లెక్కాలంటే పెద్దగా ఎవరూ ఇష్టపడరు. ఒక ఫ్లోర్ అయితే కొందరు మెట్లపైనే వెళ్లిపోతారు..ఇంకా అంతకు మించి అంటే మాత్రం లిఫ్ట్ ఉంటే బాగుండూ అనుకుంటాం. ఇంకా లిఫ్ట్ లో మిర్రర్స్ ఉండేవాటికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఆఫీసుల్లో ఈ మిర్రర్స్ ఉండే లిఫ్ట్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. లిఫ్ట్ ఎక్కి ఇక మిర్రర్ లో హెయిర్ చూసుకోవటం, డ్రస్ సరిచేసుకోవటం, లిప్ స్టిక్ వేసుకోవటం వంటివి చేస్తుంటారు. అసలు మీరంతా అనుకున్నట్లు లిఫ్ట్ లో మిర్రర్స్ పెట్టింది ఇలాంటి పనులకోసం కాదంట. మరెందుకో తెలుసా..!
అసలు మిర్రర్స్ ని పెట్టింది సేఫ్టీ పర్పస్ కోసమట. లిఫ్ట్ లో ఉన్నపుడు మనతో పాటు చాలామంది ఎక్కుతారు. మనం మిర్రర్ వైపు చూస్తూ అందరిని గమనించవచ్చు. గుంపులో ఎవరైనా దొంగతనానికి పాల్పడుతున్నా, లేక మరేదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న తేలికగా పసిగట్టవచ్చు.
లిఫ్ట్ లలో అద్దాలను మొదటిసారి జపాన్ దేశం ప్రవేశపెట్టిందట. వికలాంగులకు, వీల్ చైర్ వినియోగదారులకు మెట్లు ఎక్కడం చాలా ఇబ్బందికరం. అలాంటి వారికి లిఫ్ట్ లు సౌలభ్యంగా ఉంటాయి. కానీ వీరు వీల్ చైర్ లో కూర్చుని వెనక్కి తిప్పడం కొంత కష్టతరం గా ఉంటుంది. ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అదే మిర్రర్ ఉంటె.. వెనుక నుంచునే వ్యక్తి సేఫ్ గా వీల్ చైర్ ను తిప్పడం సాధ్యమవుతుంది.
లిఫ్ట్ లో ఎలాగో సిగ్నల్ రాదు.. సో ఫోన్ మాట్లడటం, నెట్ యూస్ చేయటం కుదరదు..అలా బోరుగా నుంచునే బదులు అద్దంలో వారి రూపాన్ని చూసుకుంటూ ఉండొచ్చు. ఇతరులను గమనిస్తూ ఉంటారు. అదే అద్దం లేకపోతె నేల చూపులు చూస్తూ ఉండాలి. లిఫ్ట్ లో ఉండే ఐదు నిముషాలు కూడా ఎక్కువ కాలం గడిపిన భావన కలుగుతుంటుంది. అద్దంలో చూసుకుంటూ ఉండడం వలన లిఫ్ట్ లో ఉన్నంత సేపు వారికి ఎలాంటి పడిపోతున్నామేమో నన్న భయం కలగకుండా కూడా ఉంటుందట.
లిఫ్ట్ లో సాధరణంగా ఎక్కువ ప్లేస్ లేకపోవడం, ఫ్రష్ ఎయిర్ తగలేకపోవడం వంటి కారణాల వలన చాలా మందికి క్లాస్ట్రోఫోబియా సమస్య ఎదురవుతుంటుంది. ఆందోళన పెరిగి ఫలితంగా వారి గుండె చప్పుడు వేగం పెరిగి అరచేతిలో చెమటలు పడుతుంటాయి. అదే లిఫ్ట్ లో అద్దం ఉండడం వలన ఈ ఆందోళనలను తగ్గుతుంది. లిఫ్ట్ ఇరుకుగా ఉందనే ఫీల్ లేకుండా చేస్తుంది.
అదనమాట సంగతి…లిఫ్ట్ లో మిర్రర్స్ పెట్టటం వెనుక ఇన్ని రీజన్స్ ఉన్నాయి.
– Triveni Buskarowthu