Women: చాలామంది ఆడవాళ్లు వివిధ పనులతో బిజీగా ఉంటారు. ఒక పక్క ఇంటి పనులు మరొక పక్క ఆఫీస్ పనులు దీంతో చాలా ఒత్తడిని ఎదుర్కొంటుంటారు. మీరు కూడా పని ఒత్తిడి వలన ఎంతో ఇబ్బంది పడుతున్నారా.. పని ఒత్తిడితో మహిళలకు కొన్ని ప్రాణాంతక సమస్యలు కలిగే అవకాశం ఉంది. మరి మహిళలకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. స్విజర్లాండ్ లో శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం మహిళల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది.
పురుషులకంటే కూడా మహిళల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. దీంతో మహిళల్లో నిద్ర పట్టకపోవడం గుండెపోటు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంట్లో పనులు బాధ్యతలు ఉద్యోగం వీటివలన ఒత్తిడి కలుగుతుందని.. ఇలా కలగడం వలన కొన్ని సమస్యలు కలుగుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒత్తిడి అధికంగా ఈ రోజుల్లో మహిళల్లో కనపడుతోందని పని ఒత్తిడి అధికంగా ఉందని అన్నారు.
2015లో 66 శాతం మంది 2012లో 50 శాతం మంది పని ఒత్తిడి ఎక్కువ ఉందని చెప్పినట్టు శాస్త్రవేత్తలు అన్నారు. ఒకవేళ కనుక పని ఒత్తిడి ఉంటే మహిళల్లో నిద్రలేమి చిరాకు రక్తపోటు ఏకాగ్రత లేకపోవడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి మహిళలు చూసుకోవాలి. పనుల వల్ల ఒత్తిడి ఎక్కువైపోతే అనారోగ్య సమస్యలు కూడా సంభవిస్తాయి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఒత్తిడిని అధిగమించడానికి వ్యాయామం మెడిటేషన్ వంటివి సహాయపడతాయి.