గజరాజా..మజాకా..అదిరిపోలే..

సోషల్ మీడియాలో జంతువులకు సంబందించి ఎన్నో వీడియోలు దర్శనమిస్తున్నాయి.. అందులో కొన్ని మాత్రం జనాలను ఔరా అనిపిస్తున్నాయి. ఆ వీడియోలను చూడటానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అ వీడియోలకు జనాలు లైకులు, షేర్లు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.మొన్నీమధ్య ఓ ఏనుగు ఫోన్ లో వీడియోలను చూడటానికి ఆసక్తి చూపించింది.. దానికున్న ఫోన్ పిచ్చి తో కష్టాలు పడింది. ఇప్పుడు మరో ఏనుగు తన లోని టాలెంట్ ను బయట పెట్టింది.

కాగా, తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఒక ఏనుగుకు సంబంధించినది. ఈ వీడియోలో ఏనుగు చేసిన పనికి నెట్టింట నవ్వులు కురుస్తున్నాయి. ఇక ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. జంతువులు చాలా వరకు మనుషుల్లా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తుంటాయి.

ముఖ్యంగా కుక్కలు, పిల్లులు వంటివి మనుషులను అనుకరిస్తూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియోలో అసలు ఏముంది అంటే.. ఈ వీడియోలో ఒక డ్రమ్ ఆర్టిస్ట్ తన పాటను ప్లే చేస్తూ కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి ఒక గజరాజు వచ్చింది. ముందున్న కంచెలోంచి తొండాన్ని చాచింది.

అతడు డ్రమ్స్ ను వాయిస్తుండగా ఆ ఏనుగు కూడా డ్రమ్స్ వాయించాడనికి ట్రై చేసింది అయితే దాని తొండంతో ఆ డ్రమ్స్ ను ప్లే చేయడానికి ట్రై చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పటికే లైకులు, షేర్ల తో ట్రెండ్ అవుతుంది. ఇక నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి అందరినీ ఆకర్షించింది. మీరు కూడా ఆ గజరాజు వీడియో పై ఒక లుక్ వేసుకోండి.. ఒక లైకు వేసుకోండి..