అయ్యోపాపం..డబ్బులు లేకుంటే ఇంత దారుణమా..వీడియో..

-

ఇప్పుడు ఏది చేయాలన్నా కూడా డబ్బులు ఉండాలి..బయట టాప్ వాటర్ తాగాలన్నా కూడా పైసలు ఇచ్చే పరిస్థితి దాపురించింది.. ఓ జీవి ప్రాణం పోసుకున్న డబ్బు ఉండాలి..ప్రాణం పోయిన డబ్బులు ఇస్తేనే అన్ని జరుగుతాయి..మానవత్వం అనేది మనుషులకు లేకుండా పోయింది.ఇప్పుడు జరిగిన ఓ ఘటన కంటతడి పెట్టిస్తుంది.ఓ చిన్నారి మృతదేహాన్ని తీసుకు వెళ్ళడానికి ఎవరూ ముందుకు రాకపోవడం సిగ్గుచేటు.. దయనీయం..విషయాన్నికొస్తే..

 

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఓ కుటుంబం నాలుగేళ్ల బాలిక మృతదేహాన్ని తమ భుజాలపై మోసుకెళ్లారు.చికిత్స కోసం ఆమెను మొదట సోమవారం బక్స్‌వాహా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లినట్లు చిన్నారి కుటుంబీకులు తెలిపారు.ఆమె పరిస్థితి విషమించడంతో అదే రోజు కుటుంబ సభ్యులు ఆమెను పక్కనే ఉన్న దామోహాకు తరలించారు, కానీ ఆమె మరణించిందని వైద్యులు ద్రువీకరించారు. బాలిక మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ కావాలని ఆస్పత్రి సిబ్బందిని కోరగా సానుకూల స్పందన రాలేదని కుటుంబీకులు తెలిపారు.

ప్రైవేట్ వాహనం ఏర్పాటు చేయడానికి డబ్బు లేకపోవడంతో మేము ఆమె మృతదేహాన్ని ఒక దుప్పటిలో చుట్టి, బక్స్వాహాకు బస్సు ఎక్కాము, అని అమ్మాయి తాత మన్సుఖ్ అహిర్వార్ చెప్పారు.బాలిక తండ్రి లక్ష్మణ్ అహిర్వార్ మాట్లాడుతూ, బక్స్వాహాకు చేరుకున్న తర్వాత మృతదేహాన్ని పౌడి గ్రామానికి తీసుకెళ్లడానికి వాహనం ఏర్పాటు చేయాలని పంచాయతీని కోరామని, అయితే వారు నిరాకరించారు.

ఈ ఘటనకు సంభందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది… ఈ విషయం పై ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. దామోహ్ సివిల్ సర్జన్ డా. మమతా తైమూర్ ఈ వాదనను ఖండించారు. తన వద్దకు ఎవరూ రాలేదని మరియు వారి వద్ద శవవాహక వ్యాన్ ఉందని చెప్పారు. మేము కొన్ని NGO లేదా రెడ్ క్రాస్ నుండి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, ఆమె కూడా చెప్పింది.మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news