Father’s day: మీ నాన్నగారి తో మీ ప్రేమ ని ఇలా పెంచుకోండి…!

-

నాన్న అమ్మ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు..? ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఎంతో గౌరవం, ఇష్టం కూడా. నిజానికి చాలా మంది పిల్లలకి వాళ్ల తండ్రి ఆదర్శం. మొదట తండ్రిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు వెళుతుంటారు. తండ్రి కాస్త స్ట్రిక్ట్ గా భయం చెప్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ ప్రేమ చూపించడానికి అవ్వదు. అందుకనే చాలా మంది పిల్లలు తల్లితో క్లోజ్ గా ఉంటారు కానీ తండ్రికి కాస్త దూరం గా ఉంటారు. అయితే కేవలం ఆయన స్ట్రిక్ట్ గా పెంచడం వలన ఆ ప్రేమకి దూరంగా ఉన్నారు తప్ప మనసులో బోలెడంత ప్రేమ ఉంటుంది. మీ తండ్రి కి మీరు దగ్గర అవ్వాలన్నా ప్రేమని మరింత పెంచుకోవాలన్నా… ఈ విధంగా అనుసరించండి.

 

మీ ఇద్దరు ఆక్టివిటీస్ లో పాల్గొనడం వలన మీ ఇద్దరి మధ్య ప్రేమని మరింత పెంచుకోవచ్చు. మీ ఇద్దరు కాసేపు సరదాగా సమయాన్ని గడపొచ్చు. వంట చేయడం గార్డెనింగ్ స్పోర్ట్స్ ఇలా ఏదైనా సరే మీ ఇద్దరికీ నచ్చే కామన్ దానిని ఎంచుకొని కాసేపు దానితో స్పెండ్ చేస్తే మీ మధ్య ప్రేమ బాగా పెరుగుతుంది పైగా సమయాన్ని మీ తండ్రి తో వెచ్చించడానికి అవుతుంది. వాళ్ళ లైఫ్ గురించి ప్రశ్నలు వేయండి. తండ్రి లైఫ్ లో ఎదురైన వాటి గురించి మీరు ప్రశ్నించండి చిన్నప్పుడు ఎలా ఉన్నారు ఎలా వాళ్ల కలల్ని నిజం చేసుకున్నారు ఏ విధంగా సక్సెస్ అయ్యారు ఇటువంటివి ఇలా మాట్లాడుతున్న క్రమంలో మీ మధ్య బాండింగ్ పెరుగుతుంది. ప్రేమ పెరుగుతుంది. ఒకరితో ఒకరు సమయాన్ని గడపడానికి అవుతుంది.

జీవితంలో తీసుకునే నిర్ణయాల గురించి మాట్లాడండి… నాన్న నేను ఇప్పుడు ఇలా ఉన్నాను రేపు ఏం చేస్తే బాగుంటుంది ఎలా ఆ సమస్యను ఎదుర్కోగలను ఇటువంటివి తండ్రి సలహా అడగండి.. ఇలా ఆయన చెప్పే క్రమంలో మీ మధ్య ప్రేమ పెరుగుతుంది పైగా ఎక్కువ సమయాన్ని మీతో గడపడానికి అవుతుంది. ఇప్పటివరకు మీ నాన్నగారికి మీరు దూరంగా ఉన్నట్లయితే ఈ ఫాదర్స్ డే కి ఇలా మీ మధ్య బంధాన్ని పెంచుకోండి కనెక్షన్ ని ఇంకాస్త పెంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news