ధనవంతుడిగా మారాలనుకుంటే తెలుసుకోవాల్సిన మనీ పాఠాలు..

-

డబ్బు సంపాదించాలి, ఇప్పుడున్న జీవితాని కంటే మంచిగా బ్రతకాలి అన్న కోరిక ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ కొందరు మాత్రమే తామనుకున్న వాటిని సాధించుకుంటారు. చాలామందికి డబ్బు సంపాదించాలని ఉంటుంది. కొంతమంది సంపాదిస్తారు కూడా. కానీ ధనవంతులు కాలేరు. అవును, ఎంత సంపాదించినా డబ్బుని మేనేజ్ చేయడం రాకపోతే ఎప్పటికీ ధనవంతులు కాలేరు. డబ్బుని మేనేజ్ చేయడం ఒక కళ. అది అబ్బాలంటే కొన్ని మనీ పాఠాలు తెలుసుకోవాలి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

డబ్బు సంపాదించడానికి సమయం చాలా ముఖ్యం. నీ దగ్గర ఎంత డబ్బున్నది ముఖ్యం కాదు. ఎంత సమయం ఉన్నాదన్నదే ముఖ్యం. అందుకే సరైన సమయాన్ని వృధా చేసుకోకండి.

ఇల్లనేది ఉండడానికే కానీ, పెట్టుబడికి కాదు. ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నా అది జీరో ఇన్వెస్ట్ మెంట్ కిందకే లెక్క.

తొందరగా ధనవంతులు అవడం ఒక్కోసారి సాధ్యమే. తొందరగా పేదవారుగా మారడమూ సాధ్యమే అన్నది మర్చిపోవద్దు.

మీకు నష్టాన్ని తెచ్చే వస్తువులపై అనవసరంగా వడ్డీలు కట్టవద్దు. అంటే, నిర్ణయం తీసుకునే ముందే బాగా అలోచించుకోవాలి.

ఆదాయం పెరుగుతున్నంత మాత్రాన జీవనశైలి మారుతున్నట్టు కాదు.

పెట్టుబడి పట్ల ఎక్కువ ఆసక్తిగా ఉన్నట్లయితే అది చెడ్డ ఆలోచన అయ్యే అవకాశం ఉంది.

రూపాయి సంపాదన కన్నా రూపాయి పొదుపు చేయడమే గొప్ప.

డబ్బు సంపాదించాలనుకుంటే ముందుగా మీ నైపుణ్యాల మీద దృష్టి పెట్టండి. ఎలాంటి నైపుణ్యం లేకుండా డబ్బు సంపాదించడానికి నైపుణ్యం కావాలి.

పెట్టుబడి సలహాలు అర్థం కానట్టుగా ఉంటే అందులో వచ్చే లాభాలు అంతగా ఉండవని అర్థం.

మీకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించేవాళ్ళని చూసి ప్రేరణ పొందండి. మీ కంటే ఎక్కువ ఖర్చు చేసే వాళ్ళని చూసి కాదు.

Read more RELATED
Recommended to you

Latest news